Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143429
            [news_title_telugu_html] => 

జేఎన్టీయూకే స్నాతకోత్సవానికి బిశ్వభూషణ్‌

[news_title_telugu] => జేఎన్టీయూకే స్నాతకోత్సవానికి బిశ్వభూషణ్‌ [news_title_english] => Biswabhushan attends JNTUK Seventh convocation [news_short_description] => తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జవహార్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏడో స్నాతకోత్సవంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. కులపతి హోదాలో ఆయన ఈ కార్యక్రమానికి [news_tags_keywords] => JNTUK,AP Governor,BiswaBhushan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => VDpnm8ac6Dk [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 13:07:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జేఎన్టీయూకే స్నాతకోత్సవానికి బిశ్వభూషణ్‌ - Biswabhushan attends JNTUK Seventh convocation - EENADU
close

తాజా వార్తలు

జేఎన్టీయూకే స్నాతకోత్సవానికి బిశ్వభూషణ్‌

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జవహార్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏడో స్నాతకోత్సవంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. కులపతి హోదాలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ ఆవరణలో ఆయన మొక్కనాటి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. స్నాతకోత్సవం సందర్భంగా బీహెచ్‌ఈఎల్‌ మాజీ సీఎండీ ప్రసాదరావుకు ఆయన డాక్టరేట్‌ ప్రదానం చేశారు.

అంతకుముందు విజయవాడ నుంచి బయల్దేరిన గవర్నర్‌  కృష్ణానది వరద ఉద్ధృతిని విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. రాజభవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా గన్నవరం వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టరులో కాకినాడ వెళ్లే ముందు వరద ప్రభావ ప్రాంతాల్లోని స్థితిగతులను పరిశీలించారు. కృష్ణానదిలో వరద ఉద్ధృతి గురించి తాజా సమాచారాన్ని అధికారులు గవర్నర్‌కు వివరించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు ఎంత పరిమాణంలో నీరు విడుదలవుతోందనేది గణాంకాలతో సహా వివరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పారు. కృష్ణా జిల్లా పరిధిలోని పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదలవుతోన్న నీటితో జగ్గయ్యపేట, కంచికచర్ల, చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, విజయవాడ నగరం, పెనమలూరు, తోట్లవల్లూరుతోపాటు నాగాయలంక వరకు మొత్తం 18 మండలాల పరిధిలో ఈ వరద తీవ్రత ఉందని అధికారులు ఆయనకకు వివరించారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.