Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143508
            [news_title_telugu_html] => 

శాంతించిన కృష్ణమ్మ.. ప్రవాహం తగ్గుముఖం

[news_title_telugu] => శాంతించిన కృష్ణమ్మ.. ప్రవాహం తగ్గుముఖం [news_title_english] => Water level decrease in Krishna river [news_short_description] => కృష్ణా నదికి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం నెమ్మదించింది. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతోంది.... [news_tags_keywords] => Water levels,projects,Krishna river,ap news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 16:58:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
శాంతించిన కృష్ణమ్మ.. ప్రవాహం తగ్గుముఖం - Water level decrease in Krishna river - EENADU
close

తాజా వార్తలు

శాంతించిన కృష్ణమ్మ.. ప్రవాహం తగ్గుముఖం

విజయవాడ: కృష్ణా నదికి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం నెమ్మదించింది. శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతోంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతున్న నీరు 6.43 లక్షల క్యూసెక్కులు కాగా.. దిగువకు 7.85 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 4 టీఎంసీల వరద నీరు ఉంది.

ఇక కృష్ణా నది పరిధిలోని జూరాల జలాశయం వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. ఇన్‌ఫ్లో 6లక్షల 32వేల క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 6 లక్షల 30వేల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 50 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 6.749 టీఎంసీల నీటిని నిల్వ ఉంది.

అటు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 6 లక్షల 35 వేల క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 7 లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు ఉండగా..ఔట్ ఫ్లో 7 లక్షల 48 వేల క్యూసెక్కుల మేర ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.50 అడుగుల నీటిమట్టం ఉంది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31వేల 349 క్యూసెక్కులు విడుదలవుతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1600 క్యూసెక్కులు విడుదల చేయగా.. హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 40 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.


శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 6 లక్షల 31 వేల క్యూసెక్కుల జలాలు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 6 లక్షల 80 వేల క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తినీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం  586 అడుగులకు చేరింది. ప్రస్తుతం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి వస్తున్న నీటితో పులిచింతల ప్రాజెక్టు కలకలలాడుతోంది. దీంతో 22 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.