Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143516
            [news_title_telugu_html] => 

యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

[news_title_telugu] => యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం [news_title_english] => cm kcr fires on YADA officials [news_short_description] => యాదాద్రి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన ఆలయం పనులు మినహా మిగతా పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి... [news_tags_keywords] => ts news,cm kcr,yadadri [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 17:20:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం - cm kcr fires on YADA officials - EENADU
close

తాజా వార్తలు

యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

మరో 5 ఏళ్లు కావాలా? అంటూ అధికారులపై మండిపాటు

యాదాద్రి: యాదాద్రి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన ఆలయం పనులు మినహా మిగతా పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించేందుకు శనివారం యాదాద్రి వెళ్లిన ఆయన.. స్థానిక హరిత హోటల్‌లో యాడా సిబ్బంది, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పనులు ఎప్పట్లోగా పూర్తి చేస్తారంటూ ప్రశ్నించారు. పనులు పూర్తి చేసేందుకు మరో ఐదేళ్లు కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు మిన్నకుండిపోయారు.

ఆలయ అభివృద్ధికి సంబంధించి రూ.473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు యాడాకు మరో ఉన్నతాధికారిని నియమించే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ పనులకు సంబంధించి ఎస్‌ఈ స్థాయి వ్యక్తి పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికారుల కోరిక మేరకు సీఈ స్థాయి వ్యక్తిని త్వరలోనే ఉన్నతాధికారిగా నియమించనున్నట్లు సమాచారం.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.