Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143557
            [news_title_telugu_html] => 

జలావాసానికి అత్తివరదరాజస్వామి..

[news_title_telugu] => జలావాసానికి అత్తివరదరాజస్వామి.. [news_title_english] => atti varadaraja swamy last darshan [news_short_description] => తమిళనాడులోని కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహించిన అత్తివరదరాజస్వామి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. స్వామివారు ఆలయంలోని అనంత పుష్కరిణిలోకి వెళ్లారు. స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. దివ్య మంగళ స్వరూపుడైన అత్తివరదరాజ స్వామి విగ్రహం జలం వీడి జనంలోకి వచ్చే మనోహర దృశ్యం 40ఏళ్లకు ఓసారి జరుగుతుంది. విష్ణుమూర్తి [news_tags_keywords] => atti varadaraja swamy, kanchipuram [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 00:32:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జలావాసానికి అత్తివరదరాజస్వామి.. - atti varadaraja swamy last darshan - EENADU
close

తాజా వార్తలు

జలావాసానికి అత్తివరదరాజస్వామి..

కాంచీపురం: తమిళనాడులోని కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహించిన అత్తివరదరాజస్వామి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. స్వామివారు ఆలయంలోని అనంత పుష్కరిణిలోకి వెళ్లారు. స్వామివారి పుష్కర ప్రవేశాన్ని ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. దివ్య మంగళ స్వరూపుడైన అత్తివరదరాజ స్వామి విగ్రహం జలం వీడి జనంలోకి వచ్చే మనోహర దృశ్యం 40ఏళ్లకు ఓసారి జరుగుతుంది. విష్ణుమూర్తి అవతారమైన అత్తివరదరాజస్వామి 1979లో భక్తులకు దర్శనమిచ్చారు. తిరిగి ఈ ఏడాది జులై 1న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 31 రోజుల పాటు శయన అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు ఆగస్టు 1 నుంచి నిలబడిన అవతారంలో దర్శనమిచ్చారు. 48 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన అత్తి వరదరాజస్వామి భక్తులకు మళ్లీ 2059లో దర్శనమివ్వనున్నారు.   

ఈ అపురూపమైన దృశ్యాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు కంచికి క్యూ కట్టారు. ఈ మనోహర దృశ్యాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలన్న సంకల్పంతో పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు అత్తివరదరాజస్వామిన దర్శించుకొని తరించారు. ఇప్పటివరకు దాదాపు కోటిమందికి పైగా స్వామివారిని దర్శించుకున్నట్టు సమాచారం. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.