Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 143922
      [news_title_telugu_html] => టాప్‌ 10 న్యూస్‌ - 9 AM
      [news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ - 9 AM
      [news_title_english] => top 10 news at 9am
      [news_short_description] => అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఘోర బాంబు పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 100 తీవ్రంగా గాయపడ్డారు. వివాహ 

      [news_tags_keywords] => top10,9am,briefs
      [news_bulletpoints] => 
      [news_bulletpoints_html] => 
      [news_videotype] => 0
      [news_videolink] => 
      [news_videoinfo] => ||
      [publish_comments_public] => 1
      [publish_createdon] => 2019-08-18 09:00:25
      [news_isactive] => 1
      [news_status] => 2
    )

)
టాప్‌ 10 న్యూస్‌ - 9 AM - top 10 news at 9am - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. పెళ్లివేడుకలో పేలుడు...40 మంది మృతి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఘోర బాంబు పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 100 తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు దాదాపు 1000 మంది వరకు హాజరైనట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  చరిత్రను మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం

అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌లో ప్రవాసాంధ్రులతో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. వైకాపా విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. ‘‘ఐ హ్యావ్‌ ఏ డ్రీమ్‌ అన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ స్ఫూర్తిదాయకం. అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రాన్ని చూడాలని నా కల. అన్నం పెడుతున్న రైతు ఆకలిబాధతో మరణించకూడదన్నది నా కల. ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, వివక్ష లేకుండా పేదవాడికి అందుబాటులోకి రావాలన్నది నా కల. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా నీరు అందించాలన్నది నా కల’’ అని జగన్‌ అన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మళ్లీ దర్శనం 2059లోనే

సుమారు కోటి మంది భక్తులను అశేషంగా ఆకట్టుకున్న అత్తి వరదర్‌ స్వామి జలావాసానికి తిరిగి వెళ్లారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో అత్తి వరదర్‌ ఉత్సవాలు శనివారం ముగిశాయి. స్వామివారికి గులాబీ రంగు పట్టు వస్త్రాలంకరణ చేశారు. నైవేద్యానంతరం సుగంధ, మూలికా ద్రవ్యాలతో రూపొందిన సాంబ్రాణి తైలాన్ని పూశారు. వేద మంత్రాల నడుమ రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య శయన అవతారంలోని స్వామి వారిని నాలుగు కాళ్ల మంటపంలోని పల్లంలో ఉంచారు. ఈ క్రతువుతో అత్తి వరదర్‌ ఉత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మెరిసిన పుజారా, రోహిత్‌

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ముంగిట జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆరంభంలో భారత్‌ తడబడ్డా.. తర్వాత పుంజుకుంది. వెస్టిండీస్‌-ఎతో శనివారం మొదలైన మూడు రోజుల మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి 297/5తో నిలిచింది. చెతేశ్వర్‌ పుజారా(100; 187 బంతుల్లో 8x4, 1X6) టాప్‌స్కోరర్‌గా నిలిచి రిటైర్డ్‌ అయ్యాడు. రోహిత్‌ శర్మ (68; 115 బంతుల్లో 8×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (36; 46 బంతుల్లో 5×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. మయాంక్‌ అగర్వాల్‌ (12), రహానె (1) త్వరగా వెనుదిరగడంతో ఒక దశలో భారత్‌ 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో పుజారా, రోహిత్‌ నాలుగో వికెట్‌కు 132 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. హనుమ విహారీ (37;101 బంతుల్లో 2X4), రవీంద్ర జడేజా(1) క్రీజులో ఉన్నారు. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్న నేపథ్యంలో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా అడుగులు వేస్తోంది.

5. ‘సైమా’ సంబరం

నువ్వా నేనా అనేలా ఫ్యాషన్‌ దుస్తులతో ముస్తాబులు... ఎర్ర తివాచీపై హొయలు... అదిరిపోయే ఆటపాటలు...  ప్రోత్సాహమిచ్చిన పురస్కారాలతో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2019 వేడుక రెండో రోజూ అట్టహాసంగా సాగింది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకి చెందిన సినీ తారలు, సాంకేతిక నిపుణులకి రెండో రోజు పురస్కారాలు అందజేశారు. ఖతార్‌లోని దోహాలో ఈ వేడుక జరిగింది. ఏటా దక్షిణాదికి చెందిన నాలుగు చిత్ర పరిశ్రమలు ఈ వేడుకలో పాలు పంచుకుంటున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అప్ప సేన సిద్ధం

మంత్రివర్గాన్ని మూడు విడతలుగా విస్తరిస్తారని తెలుస్తోంది. ప్రతిసారీ కనీసం 10 మందికి తగ్గకుండా అవకాశాలివ్వాలని పార్టీ యోచిస్తోంది. ఈ పది మందిలో 75 శాతం పార్టీ వారికి, మిగిలిన 25 శాతం అసమ్మతి ఎమ్మెల్యేల కోసం రిజర్వ్‌ చేయనున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేల కేసు విచారణకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రెండో, మూడో విడత విస్తరణలో వీరిని మంత్రివర్గంలో చేర్చుకోవాలన్నది పార్టీ ఆలోచన. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వరద తగ్గి... కష్టం పెరిగి

కృష్ణా నదికి వచ్చిన వరద క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. శుక్రవారం నాడు భారీగా కనిపించిన ఉద్ధృతి కాస్త తగ్గింది. శనివారం నాడు ఉదయం 8.21 లక్షల క్యూసెక్కులు ఉన్న ప్రకాశం బ్యారేజి ఔట్‌ఫ్లో.. రాత్రి 8 గంటలకు 7.56 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. ఇందులో సముద్రంలోకి రాత్రికి 7.39 లక్షల క్యూసెక్కులు, మిగిలిన పరిమాణం 16,686 క్యూసెక్కులను తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువలకు వదులుతున్నారు. మొత్తమ్మీద వరద ప్రవాహంలో తగ్గుదల కనిపించడంతో జిల్లా వాసులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఉద్ధృతి ప్రస్తుతానికి తగ్గినా ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొత్త బోగీలొస్తున్నాయ్‌!

‘అధునాతనమైన జర్మనీ సాంకేతికతతో రూపొందించే ఎల్‌హెచ్‌బీ బోగీలు త్వరలో పెద్దఎత్తున విజయవాడ రైల్వే డివిజన్‌కు చేరనున్నాయి. డిసెంబర్‌ నెలాఖరులోగా 300 వరకూ ఎల్‌హెచ్‌బీ బోగీలు డివిజన్‌కు రానున్నాయి. ప్రస్తుతం రైళ్లలో ఉన్న ఇంటిగ్రెల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌) బోగీలతో పోలిస్తే.. ఎల్‌హెచ్‌బీ అన్ని రకాలుగానూ అధునాతనమైనవి, పటిష్ఠమైనవి. అందుకే.. విజయవాడ డివిజన్‌లో తిరిగే రైళ్లలో దశాబ్దాలుగా ఉన్న ఐసీఎఫ్‌ బోగీలను మార్చాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఇది కార్యరూపం దాల్చబోతోంది.’ దక్షిణ మధ్య రైల్వేలో అత్యధిక ఆదాయం కలిగిన డివిజన్‌ విజయవాడ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పెద్దనోట్ల రద్దు నాటి డిపాజిట్లపై ఐటీ విభాగం ఆరా

పెద్దనోట్ల రద్దు సమయంలో బ్యాంకుల్లో జమయిన నల్లధనాన్ని గుర్తించేందుకు ఆదాయపన్ను విభాగం నడుం బిగించింది. ఈ లావాదేవీల సంగతి తేల్చేందుకు 17 సూత్రాలతో కూడిన చెక్‌ లిస్ట్‌ను రూపొందించి, దేశ వ్యాప్తంగా అందరు ట్యాక్స్‌ కమిషనర్లకు పంపింది. 2016 నవంబరు 9 నుంచి డిసెంబరు 31 వరకు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన ‘అన్‌ అకౌంటెడ్‌ క్యాష్‌’ లావాదేవీలను ఈ చెక్‌లిస్ట్‌ ఆధారంగా పన్ను అధికారులు పరిశీలిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తమిళంలోనూ నటించాలనుంది : ప్రభాస్‌

సుజిత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన రొమాంటిక్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘సాహో’. వంశీ, ప్రమోద్‌లు నిర్మాతలు. శ్రద్ధ కపూర్‌ కథానాయిక. తమిళ నటుడు అరుణ్‌ విజయ్‌ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఏకకాలంలో రూపొందింది. ఈ నెల 30న తెరపైకి రానుంది. ఇటీవలే ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ‘సందుల ఎవన్‌ వేనునానుం సిక్సర్‌ అడిప్పాన్‌.. స్టేడియంల సిక్సర్‌ అడిక్కరవనుక్కు ఒరు గెత్తు ఇరుక్కుం’ అంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగు కుర్రకారును ఆకట్టుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.