Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143979
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ @ 1 PM [news_title_english] => ONE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS,1 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 12:59:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ @ 1 PM - ONE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. భూటాన్‌ భవిష్యత్తు యువత చేతిలో ఉంది

రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌లో ఉన్న ప్రధాని మోదీ ఆదివారం ఆ దేశ రాజధాని థింపూలోని రాయల్‌ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. అక్కడ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. భూటాన్‌-భారత్‌ ప్రజల మధ్య ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తుచేశారు. దీంతో ఇరు దేశాల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు దృఢంగా మారాయన్నారు. భూటాన్‌ భవిష్యత్తు యువత చేతిలో సురక్షితంగా ఉందన్నారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత వారిపైనే ఉందని గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నాగార్జునసాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు

ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో నాగార్జునసాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో సాగర్‌గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పిల్లర్‌పార్కు నుంచి బస్టాండ్‌ వరకు ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మెట్రోలో ప్రయాణించిన లోకేశ్‌ దంపతులు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌ హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు ప్రయాణం చేశారు. దీంతో మిగతా ప్రయాణికులు వారితో  ఆసక్తిగా కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కొందరు తీసిన వీడియోలను భద్రతా సిబ్బంది సెల్‌ఫోన్‌ నుంచి తొలగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అరుణ్‌ జైట్లీ పరిస్థితిపై ఆరా

కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ఆయనను లైఫ్ సపోర్ట్‌ మీద ఉంచారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆరెస్సెస్‌ ఛీప్‌ మోహన్‌ భగవత్‌ ఎయిమ్స్‌కు వచ్చారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 10 నుంచి జైట్లీ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయలేదు. నలుగురు వైద్యుల బృందం జైట్లీకి చికిత్స అందిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సీబీఐ చేతికి

కర్ణాటక రాజకీయాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. జేడీఎస్‌ మాజీ అధ్యక్షుడు హెచ్‌ విశ్వనాథం బుధవారం చేసిన ఆరోపణలతో రాష్ట్రంలోని నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చకు దారి తీస్తున్న ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపిస్తున్నట్లు ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదివారం ప్రకటించారు. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్‌ నేతల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంపై విచారణ జరిపిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కూకట్‌పల్లిలో వెడ్డింగ్‌ కలెక్షన్ల ఆవిష్కరణలో మోడళ్ల సందడి

7. ప్రజాస్వామ్యం బతికే ఉందని అనుకుంటున్నారా?

జమ్మూకశ్మీర్‌ పీసీసీ అధ్యక్షుడు గులాం అహ్మద్‌ మిర్‌, అధికార ప్రతినిధి రవీందర్ శర్మని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఖండించారు. ఏ ప్రాతిపదికన వారిని అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘ప్రజా సమస్యలమీద మీడియాతో మాట్లాడటం నేరమా? ఏ ఆధారం ఉందని వారిని అరెస్టు చేశారు. అలా చేయమని రాజ్యాంగంలోని ఏ నిబంధన చెబుతోంది? కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా వారికి ఇవ్వడం లేదు. దేశంలోని ప్రజాస్వామ్యం బతికే ఉందని మోదీ-షా ఇంకా అనుకుంటున్నారా?’ అని ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. లార్డ్స్‌లో స్మిత్‌-ఖవాజా చెత్త రికార్డు

ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ స్టీవ్‌స్మిత్‌, ఉస్మాన్‌ ఖవాజా ఓ అరుదైన చెత్త రికార్డు సృష్టించారు. 58 ఏళ్ల తర్వాత ఆ మైదానంలో ఇలాంటి రాకార్డు నమోదవ్వడం ఇదే తొలిసారి. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌, ఖవాజా మూడో వికెట్‌కు ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. 23వ ఓవర్‌లో జట్టు స్కోర్‌ 60 పరుగుల వద్ద కామెరన్‌ బెన్‌క్రాఫ్ట్‌(13) ఔటవ్వగా స్మిత్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పటికే ఖవాజా(36) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తుండగా 24వ ఓవర్‌లో అదే స్కోర్‌ వద్ద వెనుతిరిగాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఖైరతాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

ఖైరతాబాద్‌లో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల మండలం, జినుగుపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య(56), గత కొన్ని సంవత్సరాలుగా ఖైరతాబాద్‌ సమీపంలోని బీజేఆర్‌ నగర్‌లో నివాసముంటున్నాడు. బంగారయ్యకు తరచూ భార్యతో గొడవలు జరుగుతుండేవి. శనివారం రాత్రి కూడా భార్యాభర్తలిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన భార్య దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన బంగారయ్య ఆదివారం ఉదయం ఖైరతాబాద్‌ రైలు గేటు సమీపంలోని మెట్రో పిల్లర్ 75 వద్ద రక్తం మడుగులో శవమై కనిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పెళ్లి వేడుకలో బాంబు పేలుడు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.