Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144072
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM [news_title_english] => NINE PM NEWS [news_short_description] => దేశంలోని అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్‌ నడ్డా అన్నారు. భాజపా మినహా అన్ని పార్టీల్లో దాదాపు ఇదే పద్ధతి ఉందని విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో తెదేపాకు చెందిన నేతలు, కార్యకర్తలు [news_tags_keywords] => TOP NEWS, 9 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 21:00:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM - NINE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ప్రపంచానికి నచ్చింది..కేసీఆర్‌కు నచ్చలేదు:నడ్డా

దేశంలోని అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్‌ నడ్డా అన్నారు. భాజపా మినహా అన్ని పార్టీల్లో దాదాపు ఇదే పద్ధతి ఉందని విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో తెదేపాకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా భాజపాలో చేరారు. ఈ సందర్భంగా నడ్డా ప్రసంగించారు. ప్రపంచానికి నచ్చిన ఆయుష్మాన్‌ భారత్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నచ్చకపోవడం బాధాకరమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ముందస్తు చర్యలే ప్రాణ నష్టం తగ్గించాయి

కృష్ణానది వరద ముంపు బాధితులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి ఇద్దరు చనిపోయారని.. ముందస్తు చర్యలు తీసుకున్నందునే ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ‘కల్వకుంట్ల కుటుంబపాలనకు స్వస్తి పలకాలి’

కాంగ్రెస్‌ పార్టీతో కలిసి తెరాస లాలూచీ రాజకీయాలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌గా ఉండేదని.. ఉమ్మడి రాష్ట్రంలో 15 మంది ముఖ్యమంత్రులు కంటే సీఎం కేసీఆర్‌ ఒక్కరే ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. నాంపల్లిలో జరిగిన భాజపా బహిరంగ సభలో లక్ష్మణ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు స్వస్తి పలుకుదామని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఎల్లుండి జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి మంత్రులను కూడా ఆహ్వానించారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో భూపరిపాలనతో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. వాణిజ్య ప్రకటనలు లేని ఫ్లిప్‌కార్ట్‌ వీడియోలు..!

ఆన్‌లైన్‌ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన వినియోగదారులకు వీడియో సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను చకచకా చేస్తోంది. ఈ సర్వీసు కావాలనుకుంటే ఆండ్రాయిడ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకొని పొందవచ్చు. అమెజాన్‌ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వలే ఇది కూడా స్ట్రీమింగ్‌ సర్వీసులను అందజేస్తుంది. వినియోగదారుల కోసం ఎంపికచేసిన, వారు కోరిన కంటెంట్‌ను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. నాగార్జునసాగర్ జలాశయానికి పోటెత్తిన సందర్శకులు

7. కాంగ్రెస్‌కు షాక్‌: కేంద్రానికి మాజీ సీఎం మద్దతు

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మరో ఝలక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్‌ హుడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. దేశభక్తి, ఆత్మాభిమానం విషయంలో రాజీపడే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. రోహ్‌తక్‌లో నిర్వహించిన మహాపరివర్తన్‌ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సరైన మార్గంలో వెల్లడం లేదని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. నేతాజీ గురించి తెలుసుకునే హక్కు ప్రజలకుంది

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ అదృశ్యం విషయంలో ఏం జరిగిందన్నది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నేతాజీ అదృశ్యమై నేటికి 74 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీదీ ఆయనను స్మరించుకుంటూ ట్వీట్‌ చేశారు. ‘‘1945 ఆగస్టు 18న తైవాన్‌లోని తైహోకు విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరిన నేతాజీ అదశ్యమయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది’’ అని బెనర్జీ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఆర్చర్‌.. నీ పద్ధతేం బాలేదు: అక్తర్‌

ఇంగ్లాండ్‌ బౌలర్‌ ఆర్చర్‌ పద్ధతి బాగోలేదని పాకిస్థాన్‌ బౌలింగ్‌ దిగ్గజం షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయ పడ్డాడు. యాషెస్‌ రెండో టెస్టులో ఆర్చర్ వేసిన రాకాసి బంతికి ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు బలమైన గాయమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గాయపడ్డ స్మిత్‌ను ఆర్చర్‌ పరామర్శించకుండా నవ్వుతూ ఉన్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆర్చర్‌ ప్రవర్తించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనిపై తాజాగా షోయబ్‌ అక్తర్‌ ట్విటర్‌లో స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు

చెక్‌ రిపబ్లిక్‌లో జరుగుతున్న అథ్లెట్‌స్కీ మీటింక్‌ రైటర్‌లో భారత అథ్లెట్‌ మహ్మద్‌ అనాస్‌ స్వర్ణ పతాకాన్ని సాధించాడు. పురుషుల 300 మీటర్ల పరుగును 32.41 సెకన్లలో పూర్తిచేసి పసిడి గెలుచుకున్నాడు. ఇదే రేసులో పాల్గొన్న మరో భారత అథ్లెట్‌ నిర్మల్‌ టామ్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నిర్మల్‌ రేసుని 33.03 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ విషయాన్ని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) తన ట్విటర్‌ ఖాతాలో ఉంచింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.