Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144034
            [news_title_telugu_html] => 

‘కేసీఆర్‌ చెప్పింది కళ్ల ముందు కనిపించింది’

[news_title_telugu] => ‘కేసీఆర్‌ చెప్పింది కళ్ల ముందు కనిపించింది’ [news_title_english] => PFC CMD Rajiv Sharma Meets CM Kcr [news_short_description] => తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్‌శర్మ భేటీ అయ్యారు. రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించి పవర్‌ప్లాంట్లు... [news_tags_keywords] => KCR,TRS,PFC,TS News [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:23:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘కేసీఆర్‌ చెప్పింది కళ్ల ముందు కనిపించింది’ - PFC CMD Rajiv Sharma Meets CM Kcr - EENADU
close

తాజా వార్తలు

‘కేసీఆర్‌ చెప్పింది కళ్ల ముందు కనిపించింది’

సీఎంతో పీఎఫ్‌సీ సీఎండీ రాజీవ్‌శర్మ భేటీ
దేశంలో సమగ్ర విద్యుత్‌ విధానం రావాలన్న కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్‌శర్మ భేటీ అయ్యారు. రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించి పవర్‌ప్లాంట్లు, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన.. తాజాగా ప్రగతిభవన్‌లో సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశం, రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై వీరిద్దరూ చర్చించారు. అన్ని రంగాలకూ నాణ్యమైన విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా పనిచేయాలని.. దేశంలో సమగ్ర విద్యుత్‌ విధానం రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని.. దేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలోనే పరిష్కరించుకున్నామని.. విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి పీఎఫ్‌సీ అందించిన సహకారం దోహదపడిందని చెప్పారు. 

కాళేశ్వరం.. మాటలు చెప్పినంత తేలిక కాదు

రాష్ట్రంలోని విద్యుత్‌ ప్లాంట్లు, నీటిపారుదల ప్రాజెక్టులకు తాము అందించిన ఆర్థిక సహకారం నూటికి నూరుపాళ్లు సద్వినియోగం కావడం సంతోషంగా ఉందని రాజీవ్‌శర్మ అన్నారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని.. మూడున్నరేళ్ల కింద కేసీఆర్‌ ఏం చెప్పారో అది కళ్ల ముందు కనిపించిందని కొనియాడారు. ఇలాంటి ప్రాజెక్టును ఇంత త్వరగా నిర్మించడం మాటలు చెప్పినంత తేలిక కాదని రాజీవ్‌శర్మ అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ కృషి ఫలించిందని.. ఆయన కల నెరవేరిందని అభినందించారు. రాష్ట్రంలో విద్యుత్‌ రంగం సాధించిన విజయాల వెనుక జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు కృషి ఉందని సీఎం కేసీఆర్‌, సీఎస్‌ ఎస్కే జోషి, రాజీవ్‌శర్మ ప్రశంసించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.