Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144102
            [news_title_telugu_html] => 

మనసు చిత్రం

[news_title_telugu] => మనసు చిత్రం [news_title_english] => [news_short_description] => ఓ చిత్రంలో అచ్చెరువొందే ప్రకృతి దశ్యాలుంటాయి. మరోదాంట్లో ఆశ్చర్యపరిచే విశేషాలుంటాయి. అదే చిత్రంలో మనసున్న మారాజులుంటే.. పది మందికీ స్ఫూర్తినిస్తుంది. [news_tags_keywords] => visakhapatnam, free food, kl university, quotes [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:12:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మనసు చిత్రం - EENADU
close

తాజా వార్తలు

మనసు చిత్రం

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

ఓ చిత్రంలో అచ్చెరువొందే ప్రకృతి దశ్యాలుంటాయి. మరోదాంట్లో ఆశ్చర్యపరిచే విశేషాలుంటాయి. అదే చిత్రంలో మనసున్న మారాజులుంటే.. పది మందికీ స్ఫూర్తినిస్తుంది. ఈ ఛాయాచిత్రాల వెనకున్న కథలు మానవత్వానికి చిరునామాలు..●

...హరి ఉన్నారు!

విశాఖపట్నం.. రద్దీగా ఉన్న ఓ దారి. రోడ్డు పక్కన చింపిరి జుట్టుతో, నెరిసిన గడ్డంతో ఓ అభాగ్యుడు.. అందరూ చీదరించుకుంటున్నారు. ఇంతలో ఓ యువకుడు వచ్చాడు. అతన్ని ఆప్యాయంగా పలకరించాడు. ఆ పక్కనే కూర్చోబెట్టి.. కటింగ్‌, షేవింగ్‌ చేశాడు. ఆ మనిషి ముఖంలో కొత్త తేజస్సు. కళ్లల్లో నీళ్లు. తోచిందేదో అతడి చేతిలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడా యువకుడు. వృద్ధులకు, మతిస్థిమితం కోల్పోయిన వారి బాగోగులు చూసుకునే ఆ యువకుడి పేరు హరిప్రసాద్‌. ఏంబీఏ చదువుతున్నాడు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటాడు. 2008లో యువసేన ఫౌండేషన్‌ స్థాపించాడు. రక్తదానాలు, మన్యంలో గిరిజనులకు అవగాహన సదస్సులు, వృద్ధులకు సపర్యలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

బి.గోపికృష్ణ, విశాఖపట్నం

ఆకలి తీర్చే వీధి

ఇంటికి అతిథి వస్తే.. ఇప్పుడెందుకు వచ్చాడనుకునే రోజులు. ఎప్పుడు వెళ్లిపోతాడా అని చూసే మనుషులు. ఈ కాలంలోనూ వచ్చిన వారికి కాదనకుండా భోజనం పెడుతున్నారీ దంపతులు. దారినపోయే వారెవరైనా సరే.. ఆకలితో ఆ వీధిలోకి వెళ్తే ఖాళీ కడుపుతో తిరిగిరారు. ఈ నిత్యాన్నదానం విజయవాడ మ్యూజియం రోడ్డులో జరుగుతోంది. కె.ఎల్‌ యూనివర్సిటీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆయన భార్య శివకాంచన లత పదిహేనేళ్లుగా ఈ బృహత్కార్యాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. తమ కళాశాల హాస్టల్‌లో వండిన ఆహార పదార్థాలను నిత్యం అన్నార్తులకు దానం చేస్తారు. సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర ప్యాకెట్లు కట్టి వచ్చిన వారికి లేదనకుండా పంచుతారు. నగరానికి పనిపై వచ్చే వాళ్లు, నిరుద్యోగులు, నిరుపేద వృద్ధులు ఇలా ఎందరో ఇక్కడ ఆకలి తీర్చుకుంటుంటారు.

ఫొటో: బి.మరిడయ్య●

రీతులు మార్చే రాతలు

‘నాకెందుకు?’ మనసు స్పందించాల్సిన ప్రతిసారీ.. వెనక్కి నెట్టే మాట ఇది. ఆయన అలా అనుకోలేదు. ‘నా వంతుగా’ అనుకున్నారు. అంతటితో వదిలేయలేదు. రోజుకు రెండు గంటలు కష్టపడుతున్నారు. నెలకు రూ.800కు పైగా ఖర్చు చేస్తున్నారు. మెరుగైన సమాజం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎనిమిదేళ్లుగా కృషి చేస్తున్నారు చిత్తూరువాసి మురళి. యోగా శిక్షకుడు, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడకం, పర్యావరణ కాలుష్యంపై కలత చెందారు. ప్రకృతిని కాపాడడానికి సమాజాన్ని జాగృతం చేయాలనుకున్నారు. తన సంకల్పానికి అక్షర రూపమిచ్ఛి. సూక్తులుగా గోడలపై రాయడం మొదలుపెట్టారు. చిత్తూరు పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో కలిపి 12,000 ప్రాంతాల్లో కర్తవ్యబోధ చేశారు. వేలాది మొక్కలు నాటారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇంకుడు గుంతలు తవ్వించడం, మట్టి గణపతుల పంపిణి, ప్లాస్టిక్‌ వ్యతిరేక సదస్సులు ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంట్లో వాళ్లు వ్యతిరేకించినా, ఆర్థిక వనరులు చాలకున్నా, ఆరోగ్యం సహకరించకున్నా.. తన రాతలు ఒక్కరిలో మార్పు తెచ్చినా అదే పదివేలు అంటారు మురళి.

ఫొటో: సుబ్రహ్మణ్యం, చిత్తూరు

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.