Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 144437
      [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ - 9AM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ - 9AM [news_title_english] => nine am news [news_short_description] => [news_tags_keywords] => top10,news,9am [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 08:59:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ - 9AM - nine am news - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9AM

1. ప్రాణాధార వ్యవస్థపై అరుణ్‌జైట్లీ

దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీని ప్రాణాధార వ్యవస్థపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే డయాలిసిస్‌ చికిత్స అందిస్తున్న వైద్యుల బృందం ఆదివారం సాయంత్రం ఆయనను గుండె, శ్వాస వ్యవస్థలకు తోడ్పాటు అందించే ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌ (ఈసీఎంవో) వ్యవస్థపై ఉంచింది. శ్వాస సంబంధ ఇబ్బందులతో బాధ పడుతున్న అరుణ్‌ జైట్లీని ఈ నెల 9న ఎయిమ్స్‌లో చేర్పించిన సంగతి తెలిసిందే. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలుసుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

మహారాష్ట్రలోని దులే జిల్లా దొండైచ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కంటైనర్‌ ఢీకొన్న ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పలువురు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ఔరంగబాద్‌ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఆక్రమిత కశ్మీర్‌పై గురి!

జమ్మూ-కశ్మీర్‌ అంశంపై భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు ఆదివారం తమ స్వరాన్ని పెంచారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని ఆపనంతకాలం పాకిస్థాన్‌తో చర్చలు అసాధ్యమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. ఒకవేళ ఆ దేశంతో చర్చలు జరపాల్సి వస్తే అవి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పైనే ఉంటాయని హరియాణాలోని కల్కాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన తేల్చి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. హరిత చైతన్యం @ రెండు కోట్ల మొక్కలు

‘మొక్క నాటండి, దాన్ని పరిరక్షించండి, మీలా చేయాలంటూ ముగ్గురిని ప్రోత్సహించండి’ అనే నినాదంతో తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రారంభమైన హరిత సవాల్‌(గ్రీన్‌ ఛాలెంజ్‌) కార్యక్రమంలో ఏడాది వ్యవధిలో రెండు కోట్ల మొక్కలు నాటారు. 2018 జులై 28న హైదరాబాద్‌లో సంతోష్‌ మొక్కను నాటి స్వీయచిత్రం దిగి దానిని ట్విటర్లో పెట్టి సవాలు విసిరారు. అలా విజయవంతంగా సాగిన హరిత ఛాలెంజ్‌లో తాజాగా ఆదివారం నాటికి మొక్కల సంఖ్య రెండుకోట్లకు చేరింది. దీనికి గుర్తుగా సంతోష్‌కుమార్‌ ఆదివారం హైదరాబాద్‌లో మరో మొక్కను నాటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుక

6. పల్లెకూ మానసిక వైద్యం!

దేశంలో మానసిక ఆరోగ్యం కునారిల్లుతోంది. వేర్వేరు రకాల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు సుమారు 14 శాతం మంది ఉంటారని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకొని పల్లె ముంగిటకు మానసిక వైద్యాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. తాజాగా దిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో తెలంగాణ నుంచి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ఎంపిక చేసిన పీహెచ్‌సీల్లో చికిత్సను ప్రవేశపెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వారానికి ఒకరోజు ప్రత్యేకంగా ఈ చికిత్సల కోసమే ఓపీ నిర్వహించాలని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. 26న క్షిపణి పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన 

కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో డీఆర్‌డీఓ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్షిపణి పరీక్ష కేంద్రానికి ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారు. 154.42 హెక్టార్లకు సంబంధించి ఇటీవలే అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతులు వచ్చాయి. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఉత్తరాదిపై కుంభవృష్టి

కుండపోతగా కురుస్తున్న వర్షాలు ఉత్తరాదిన హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లను అతలాకుతలం చేశాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. మూడు రాష్ట్రాల్లో ఆదివారం 28 మంది ప్రాణాలు కోల్పోగా, 22 మంది జాడ తెలియరాలేదు. చాలాచోట్ల వరదలకు ఇళ్లు కొట్టుకుపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అపోలో ఆసుపత్రుల్లో విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు

దేశంలోని అన్ని అపోలో ఆసుపత్రుల్లో ప్రజా విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ రంగ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ (ఈఈఎస్‌ఎల్‌) వెల్లడించింది. ఈ ఒప్పందం పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ‘దేశంలో ప్రజా విద్యుత్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ఓ ప్రైవేటు భాగస్వామితో ఇలా ఎంఓయూ కుదుర్చుకోవడం ఇదే తొలిసార’ని ఈఈఎస్‌ఎల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. హిమ సిక్సర్‌

ఐరోపా అథ్లెటిక్స్‌ పోటీల్లో భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ మళ్లీ మెరిసింది. ఆమె వరుసగా ఆరో స్వర్ణం కైవసం చేసుకుంది. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన అథ్లెటిక్‌ మిటింక్‌ రీటెర్‌ ఈవెంట్లో 300 మీటర్ల పరుగులో హిమ పసిడి గెలుచుకుంది. జూన్‌ 2న ప్రారంభమైన హిమ జోరు కొనసాగుతూనే ఉంది. 200 మీటర్ల విభాగంలో నాలుగు పసిడి పతకాలు గెలిచిన ఆమె.. 400 మీ పరుగులో ఒక స్వర్ణం,  300 పరుగులో మరో పసిడి గెలిచింది. ఇదే క్రమంలో 400 మీ పరుగులో సీజన్‌ ఉత్తమ టైమింగ్‌ (52.09 సె) కూడా నమోదు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.