Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144601
            [news_title_telugu_html] => 

న్యూయార్క్‌లో ఘనంగా ‘ఇండియా డే పరేడ్‌’

[news_title_telugu] => న్యూయార్క్‌లో ఘనంగా ‘ఇండియా డే పరేడ్‌’ [news_title_english] => India Day Parade In New York Features Gandhi Tricolour Bollywood Stars [news_short_description] => అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ‘ఇండియా డే పరేడ్‌’ వేడుకలను అక్కడి భారతీయులు ఆదివారం ఘనంగా నిర్వహించున్నారు. నగరంలోని మాడిసన్‌ ఎవెన్యూ వద్ద ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. [news_tags_keywords] => newyork,india day parade,indians,bollywood stars [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 23:50:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
న్యూయార్క్‌లో ఘనంగా ‘ఇండియా డే పరేడ్‌’ - India Day Parade In New York Features Gandhi Tricolour Bollywood Stars - EENADU
close

తాజా వార్తలు

న్యూయార్క్‌లో ఘనంగా ‘ఇండియా డే పరేడ్‌’

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో భారత త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. మహాత్మా గాంధీ వేషధారణలో వ్యక్తులు నగర వీధుల్లో నడుస్తుంటే, మిగతా భారతీయుల వందేమాతర నినాదాలు న్యూయార్క్‌ వీధుల్లో హోరెత్తాయి. ఈ విధంగా న్యూయార్క్‌లో  ‘ఇండియా డే పరేడ్‌’ వేడుకలను అక్కడి భారతీయులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని మాడిసన్‌ ఎవెన్యూ వద్ద ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అక్కడ ఉండే భారతీయులతో పాటు బాలీవుడ్‌ నటులు సునీల్‌ శెట్టి, గుల్షన్‌ గ్రోవర్‌, హీనా ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భారతీయులు సంప్రదాయ నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. భారత జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ ఆడిపాడారు. కొందరు మహాత్మా గాంధీ వేషధారణలో కొందరు వీధుల్లో నడుస్తూ ఆకట్టుకున్నారు. భారత సంస్కృతి ఉట్టిపడేలా జాతీయ జెండాలతో, వందేమాతరం, జైహింద్‌ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ సంగీతం న్యూయార్క్‌ వీధుల్లో మారుమోగింది. ఈ వేడుకల్లో అక్కడి భారతీయులు వేలాదిగా పాల్గొన్నారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.