Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144629
            [news_title_telugu_html] => 

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

[news_title_telugu] => టాప్ 10 న్యూస్‌ @ 9 PM [news_title_english] => NINE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS, 9 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 21:00:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్ 10 న్యూస్‌ @ 9 PM - NINE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. పోలవరంపై రంగంలోకి కేంద్ర ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలపై ఆరా తీసింది. ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను కేంద్ర జల్‌ మంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రానికి ఎలాంటి సమాచారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం టెండర్లు రద్దు చేయడం.. రివర్స్‌ టెండరింగ్‌కు నోటిఫికేషన్‌ జారీ చేయడం తదితర అంశాల నేపథ్యంలో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ పీపీఏను కేంద్రం కోరడం చర్చనీయాంశమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఉపాధ్యాయుల నియామకంపై సుప్రీంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకంలో జాప్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్‌ 4లోపు ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేస్తామని, పాఠశాలల్లో వసతులపై న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ సీఎస్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌పై సర్వోన్నత న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ అంశాన్ని వచ్చేవారం విచారిస్తామని జస్టిస్‌ అరుణ్‌మిశ్రా ధర్మాసనం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. బంగ్లాల ఖాళీకి మాజీ ఎంపీలకు డెడ్‌లైన్‌

తమ పదవీకాలం ముగిసినా ప్రభుత్వం కేటాయించిన బంగ్లాల్లో కొనసాగుతున్న మాజీ ఎంపీలకు కేంద్రం గడువు విధించింది. వారంలోగా భవనాలు ఖాళీ చేయాలని సూచించింది. ముఖ్యంగా లుటెయిన్స్‌ ప్రాంగణంలోని బంగ్లాల్లో నివాసముంటున్న మాజీ ఎంపీలు వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.చివరి మూడు రోజులూ విద్యుత్‌, నీటి సరఫరా కూడా నిలిపివేయాలని ఆదేశించినట్లు హౌసింగ్‌ కమిటీ ఛైర్మన్ సీఆర్‌ పాటిల్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. తెరాసకు ఇక నిద్రలేని రాత్రులే: లక్ష్మణ్‌

తెరాస ప్రభుత్వ గారడీ విద్యలు ఇక సాగవని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా ఇకపై తరచూ రాష్ట్రానికి వస్తారని.. ఇక తెరాసకు నిద్రలేని రాత్రులేనని లక్ష్మణ్‌ హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఇలాంటి రాజకీయాలెప్పుడూ చూడలేదు:దేవెగౌడ

రాష్ట్రంలోని ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే కర్ణాటకలోని యడియూరప్ప ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడంలేదని మాజీ ప్రధాని దేవెగౌడ విమర్శించారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ‘‘నేను ప్రధానిగానూ పనిచేశా. కానీ ఇలాంటి రాజకీయాలను ఎప్పుడూ చూడలేదు’’ అని దేవెగౌడ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. చైనా ‘సుంకాలు’ తిని బతుకుతోంది: ట్రంప్‌

అమెరికా-చైనాల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతూ, ఒక దేశం వస్తువులపై మరో దేశం పన్నులు పెంచుతూ పోతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. ద్రవ్య సంబంధ లావాదేవీల్లో మోసపూరితంగా వ్యవహరించడం ద్వారా చైనా సుంకాలు తిని బతుకుతోందని ట్రంప్‌ విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. శవాలపై ఉప్పుపోసి నాలుగు గంటల నీరీక్షణ

8. ఆంక్షల సమయంలో గిలానీకి ఇంటర్నెట్‌ సేవలు

ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఇటీవల జమ్ముకశ్మీర్‌లో నిషేధాజ్ఞలు విధించారు. అవాంఛిత సంఘటనలు జరగకుండా ఫోన్‌కాల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ వేర్పాటువాది సయ్యద్‌ అలీ షా గిలానీకి మాత్రం నాలుగురోజులు ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉండటం తాజాగా వివాదాస్పదంగా మారింది. దీంతో గిలానీకి సహకరించిన ఇద్దరు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. హువావేపై నిషేధం: అమెరికా కీలక నిర్ణయం

చైనాకు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం హువావేకు ఊరట కలిగించే అంశం. ఆ సంస్థపై అమెరికా విధించిన నిషేధాన్ని 90రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరో 90రోజుల పాటు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్బర్‌ రోస్‌ ప్రకటించారు. దీంతో హువావే అమెరికా కంపెనీలతో క్రయవిక్రయాలు జరపవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 22న టీమిండియా సహాయ కోచ్‌ ఫలితాలు!

కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రిని టీమిండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీమిండియా సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియ నేటి నుంచి జరుగుతోంది. బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ల ఎంపికను చేపట్టనుంది. అయితే సహాయక సిబ్బంది ఫలితాలు గురువారం ప్రకటిస్తారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.