Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 144991
      [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ - 9AM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ - 9AM [news_title_english] => nine am news [news_short_description] => [news_tags_keywords] => top10,news,9am [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 08:59:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ - 9AM - nine am news - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9AM

1. నేడు చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2

చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం మంగళవారం జరగనుంది. ఇందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. గతనెల 22న శ్రీహరికోట రాకెట్‌ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపారు. అది 29 రోజుల తర్వాత మంగళవారం ఉదయం 9.30 గంటలకు చంద్రుని కక్ష్యలోకి చేరుకోనుంది. ఈ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అత్యంత కీలక ఘట్టం. ఈ ప్రక్రియలో ఉపగ్రహంలోని ద్రవ ఇంజిన్‌ను మండిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రాజీవ్‌ గాంధీకి ప్రముఖుల నివాళి

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రముఖులు నివాళులర్పించారు. రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. దిల్లీలోని రాజీవ్‌ గాంధీ సమాధి వద్ద కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్‌ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్‌ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. 

3. కలెక్టర్లే కార్యసాధకులు 

జిల్లా కలెక్టర్ల వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు వారికి కీలక బాధ్యతలను అప్పగించాలని తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. ఇప్పటికే పంచాయతీరాజ్‌, పురపాలక కొత్త చట్టాల్లో వారికి ముఖ్య అధికారాలు కట్టబెట్టారు. కీలక నిర్ణయాలను తీసుకునే వీలు కల్పించారు. త్వరలో రానున్న కొత్త రెవెన్యూ చట్టంలోనూ కలెక్టర్లకు ప్రాధాన్యం కల్పించబోతున్నారు. వీటన్నింటిపైనా దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళ, బుధవారాల్లో ప్రగతిభవన్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ! 

ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ రూపును సంతరించుకుంటోంది. రాష్ట్రంలో అర్హత ఉన్న 1.44 కోట్ల కుటుంబాలకు ఈ కొత్త కార్డులను ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పుట్టినరోజు డిసెంబరు 21 నుంచి వీటిని పంపిణీ చేస్తారు. వార్షికాదాయం రూ.5 లక్షలున్న కుటుంబాలనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానున్నారు. రుసుములు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యసేవలు పొందే విధానాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. నిరుద్యోగులకు బొగ్గు మసి 

ప్రభుత్వరంగ సంస్థ కోల్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాల భర్తీ పేరుతో ఓ వెబ్‌సైట్‌ నిర్వాహకులు నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. దాదాపు పదిహేనురోజులపాటు వారి దందా యథేచ్ఛగా సాగిపోయాక.. వేలాదిమంది నిరుద్యోగులు మోసపోయాక తీరిగ్గా ఇప్పుడు.. అది తమకు అనుబంధ సంస్థ కాదంటూ కోల్‌ ఇండియా ప్రకటించడం విశేషం. దీంతో నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నేడే కర్ణాటక మంత్రివర్గ విస్తరణ

ముఖ్యమంత్రి యడియూరప్ప నేతృత్వంలోని కర్ణాటక నూతన సర్కారు మంగళవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టనుంది. జులై 25న సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. 25 రోజుల తర్వాత భాజపా ప్రభుత్వం తొలివిడత మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు కొత్త మంత్రులు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేస్తారు. కనీసం 12-15 మంది మంత్రులు కానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పొరుగుబోతు మాటలవి 

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తున్న పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ధోరణిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వద్ద తీవ్రస్థాయిలో ఎండగట్టారు. మోదీ సోమవారం ఫోన్‌లో ట్రంప్‌తో సంభాషించారు. జమ్మూ-కశ్మీర్‌లో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక వీరిరువురి మధ్య చర్చలు జరగడం ఇదే మొదటిసారి. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికి, ఉగ్ర విధ్వంసానికి తావులేని వాతావరణాన్ని ఏర్పర్చాల్సిన ఆవశ్యకతను కూడా మోదీ ప్రస్తావించారు. ఈ మార్గాన్ని అనుసరించేవారితో కలసి పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై భారత్‌ చిత్తశుద్ధితో పోరాడుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. తప్పుడు సందేశాలను 72 గంటల్లో తొలగించాల్సిందే

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సందేశాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. సామాజిక మాధ్యమాల బాధ్యతను మరింత పెంచేలా ఈ నియమ నిబంధనలున్నాయి. చట్ట వ్యతిరేక, అభ్యంతరకర సమాచారం ఉన్నట్టు ప్రభుత్వ సంస్థలు అప్రమత్తం చేసిన 72 గంటల్లోగా సదరు సామాజిక మాధ్యమాలు వాటిని తొలగించాలి. అవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో కూడా సంబంధిత సంస్థలకు తెలియజేయాలి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి సంస్థలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ ఇప్పటికే విధివిధానాలను రూపొందించి, న్యాయశాఖ పరిశీలనకు పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అఖాతాల అంతు తేల్చే యత్నం!

మహాసముద్రాల్లో వాతావరణ మార్పులపై అధ్యయనం చేయడానికి భారత్‌ సిద్ధమైంది. ఇందుకోసం డీప్‌ ఓషన్‌ మిషన్‌ పేరుతో భారీ ప్రాజెక్టును ప్రారంభించనుంది. కేంద్ర భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్‌ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. వాతావరణ మార్పులు, సముద్ర జీవవైవిధ్యం, హైడ్రోకార్బన్లు, ఖనిజాలు వంటివాటిపై సర్వే, సముద్ర ఉపరితలం శోషించుకున్న కార్బన్‌డై ఆక్సైడ్‌ లోపల ఎలా నిల్వ ఉంటుంది. తిరిగి ఎలా బయటకు వస్తుంది. తదితర అంశాలపై అధ్యయనం చేయనునున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఆరంభం అదిరింది

ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు చక్కటి ఆరంభం లభించింది. తొలి రోజు బరిలో నిలిచిన ముగ్గురు క్రీడాకారులూ చక్కటి విజయాలతో రెండో రౌండు చేరారు. పురుషుల సింగిల్స్‌లో పతకాశలు రేపుతున్న కిదాంబి శ్రీకాంత్‌.. తడబడుతూ మ్యాచ్‌ను ఆరంభించినప్పటికీ.. తర్వాత పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. సాయిప్రణీత్‌, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సైతం శుభారంభం చేశారు. మహిళల డబుల్స్‌లోనూ భారత్‌కు మంచి ఆరంభమే లభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.