Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145136
            [news_title_telugu_html] => ఎన్‌ఆర్‌సీ కారణంగారద్దైన పెళ్లి
            [news_title_telugu] => ఎన్‌ఆర్‌సీ కారణంగారద్దైన పెళ్లి
            [news_title_english] => Assam wedding off as groom fails NRC test 
            [news_short_description] => వారిద్దరూ ఒకర్నొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. అభిరుచులు, అభిప్రాయాలు పంచుకున్నారు. జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్న వారు ప్రేమ బంధాన్ని పెళ్లితో ముడివేసి ఒక్కటవ్వాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా రెండు కుటుంబాలకు ..

            [news_tags_keywords] => nrc,assam
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-21 00:12:54
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఎన్‌ఆర్‌సీ కారణంగారద్దైన పెళ్లి - Assam wedding off as groom fails NRC test - EENADU
close

తాజా వార్తలు

ఎన్‌ఆర్‌సీ కారణంగారద్దైన పెళ్లి

వరుడికి భారత పౌరసత్వం లేదన్న వధువు తండ్రి

దిస్పూర్‌: వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అభిరుచులు, అభిప్రాయాలు పంచుకున్నారు. జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్న వారు ప్రేమ బంధాన్ని పెళ్లితో ముడివేసి ఒక్కటవ్వాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా రెండు కుటుంబాలకు విషయం చెప్పారు. వారు కూడా ఒప్పుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. రెండు వైపులా పనులు ప్రారంభమయ్యాయి. శుభలేఖలు పంచడం, పెళ్లి బట్టలు కొనడం, వివాహ వేదిక ఏర్పాటు దగ్గర్నుంచి అన్ని పనులు చకచకా చేస్తున్నారు. ఇక కొన్నిరోజుల్లో తాము ఒక్కటవ్వబోతున్నామని, తమను ఇంకెవ్వరూ వేరు చేయలేదని సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంతలో జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్‌ఆర్‌సీ) వారిద్దరినీ వేరు చేసింది. 

ఆ వివరాల్లోకెళ్తే.. అసోంలోని నయగ్రమ్‌ గ్రామానికి చెందిన దిల్వర్‌ హుస్సేన్‌ లస్కర్‌ అనే యువకుడు, రవీనా అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. రెండు వైపుల పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో పాటు పెళ్లి తేదీని కూడా నిర్ణయించారు. అంతా సంతోషంగా పెళ్లి పనులు చేసుకుంటుండగా నెల తర్వాత వచ్చి ఈ పెళ్లి జరగదంటూ వధువు తండ్రి కుతుబ్‌ వరుడి కుటుంబసభ్యులకు చెప్పాడు. జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్‌ఆర్‌సీ)లో నమోదు కాని వ్యక్తితో తన కూతురి వివాహం జరిపించనని వధువు తండ్రి కుతుబ్‌ అన్నాడు. అతనితో వివాహం చేస్తే ఆమె పౌరసత్వం కూడా ప్రశ్నార్థకమవుతుందన్నాడు. ఎన్‌ఆర్‌సీ తుది జాబితా ఇప్పటికీ విడుదల అవ్వలేదని ఇంకా అవకాశం ఉందని చెప్పినా వధువు తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. కారణం తెలుసుకున్న వరుడి కుటుంబసభ్యులు అతనికి నచ్చజెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా అంగీకరించకపోవడంతో వధూవరులు దిల్వర్‌, రవీనా శనివారం ఇంటి నుంచి పారిపోయారు. దీంతో దిల్వర్‌ తన కుమార్తెను అపహరించాడని కుతుబ్‌ సిల్చర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

ఆసోం వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీలో నమోదు కాకుండా 40లక్షల మిగిలిపోయారని గతేడాది జులైలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్‌ఆర్‌సీలో నమోదు కాని వారిలో దిల్వర్‌ కూడా ఒకరు. ఈ ఆగస్టు 31 నాటికి ఎన్‌ఆర్‌సీ నమోదు ప్రక్రియ పూర్తి చేసి తుదిజాబితా విడుదల చేస్తామని కేంద్రప్రభుత్వం చెబుతోంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.