Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145554
            [news_title_telugu_html] => 

కదిలే రైల్లో ఫొటో షూట్‌.. వీడియో వైరల్‌..!

[news_title_telugu] => కదిలే రైల్లో ఫొటో షూట్‌.. వీడియో వైరల్‌..! [news_title_english] => women photoshoot in running train [news_short_description] => ఓ మహిళ కదిలే రైల్లో ఫొటోలు తీసుకుని ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. తనకు తానే సెల్ఫ్‌ టైమర్‌ పెట్టుకుని ఫొటోలు.............. [news_tags_keywords] => photoshoot,train,New York [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1162847464036024320 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 12:41:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కదిలే రైల్లో ఫొటో షూట్‌.. వీడియో వైరల్‌..! - women photoshoot in running train - EENADU
close

తాజా వార్తలు

కదిలే రైల్లో ఫొటో షూట్‌.. వీడియో వైరల్‌..!

న్యూయార్క్‌: ఓ మహిళ కదిలే రైల్లో ఫొటోలు తీసుకుని ప్రయాణికులను ఆశ్చర్యపరిచింది. తనకు తానే సెల్ఫ్‌ టైమర్‌ పెట్టుకుని ఫొటోలు తీసుకుంది. ఇది చూసిన తోటి ప్రయాణికులు ముక్కున వేలేసుకొన్నారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ఆత్మవిశ్వాసానికి ఫిదా అవుతున్నారు. 
అసలేం జరిగిందంటే... న్యూయార్క్‌కు చెందిన జెస్సికా జార్జ్‌ అనే మహిళ ఆదివారం రైల్లో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో రైల్లో ప్రయాణికులు రద్దీ తక్కువగా ఉండటంతో ఆమె తన ఫోన్‌లో సెల్ఫ్‌ టైమర్‌ ఆన్‌ చేసి తనకు తానే ఫొటోలు తీసుకుంది. ఆ తర్వాతి స్టేషన్‌లో ప్రయాణికులు రైల్లోకి ఎక్కారు. అయినా ఆమె ఫొటోలు తీసుకోవడం ఆపలేదు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు ఆమెను ఒకింత ఆశ్చర్యంగా చూశారు. ఆమె ఆత్మవిశ్వాసానికి ఫిదా అయ్యారు. సాధారణంగా రద్దీ ప్రదేశాల్లో ఇలా ఫొటోలు తీసుకోవడం అరుదుగా కనిపిస్తుంటుంది. ఈ తతంగాన్ని అక్కడున్న మరో ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్‌లో పోస్టు చేశాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇప్పటి వరకూ 8.7 మిలియన్‌ మంది ఈ వీడియోను వీక్షించారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి..!

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.