Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145572
            [news_title_telugu_html] => 

అనామిక కుటుంబానికి భాజపా సాయం

[news_title_telugu] => అనామిక కుటుంబానికి భాజపా సాయం [news_title_english] => BJP Laxman helping hand to Anamika sister [news_short_description] => తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఘోర తప్పిదాల నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక కుటుంబానికి భాజపా అండగా నిలబడింది. ఆమె సోదరి ఉదయశ్రీ చదువుకు అవసరమయ్యే ఖర్చును తమ పార్టీ భరిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. కోఠి సుల్తాన్‌బజార్‌ సమీపంలోని.... [news_tags_keywords] => Laxman,BJP,Interboard,ts news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 18:49:07 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అనామిక కుటుంబానికి భాజపా సాయం - BJP Laxman helping hand to Anamika sister - EENADU
close

తాజా వార్తలు

అనామిక కుటుంబానికి భాజపా సాయం

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఘోర తప్పిదాల నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక కుటుంబానికి భాజపా అండగా నిలబడింది. ఆమె సోదరి ఉదయశ్రీ చదువుకు అవసరమయ్యే ఖర్చును తమ పార్టీ భరిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. కోఠి సుల్తాన్‌బజార్‌ సమీపంలోని ప్రగతి మహా విద్యాలయలో డిగ్రీ చదువుతున్న ఉదయశ్రీని లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ కలిసి పరామర్శించారు. ఆమెకు మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నేతలు విమర్శలు గుప్పించారు. చనిపోయిన అనామిక కుటుంబాన్ని ఒక్క మంత్రిగానీ.. స్థానిక ఎమ్మెల్యేగానీ పరామర్శించకపోవడం దారుణమన్నారు. పరీక్షల్లో ఫెయిలై 27 మంది విద్యార్థుల మరణానికి కారణాలను చెప్పలేకే ప్రభుత్వం నాటకాలాడుతోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై త్వరలోనే రాష్ట్రపతిని కలిసి వివరిస్తామని తెలిపారు. బాలిక చదువుకు కళాశాల యాజమాన్యం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పుస్తకాల కోసం రూ.15వేల చెక్కును లక్ష్మణ్‌ ఆమెకు అందజేశారు. తన చదువుకు అండగా నిలిచిన భాజపా నేతలకు ఉదయశ్రీ కృతజ్ఞతలు తెలిపింది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.