Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145635
            [news_title_telugu_html] => 

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

[news_title_telugu] => టాప్ 10 న్యూస్‌ @ 5 PM [news_title_english] => FIVE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS, 5 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 17:00:36 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్ 10 న్యూస్‌ @ 5 PM - FIVE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 5 PM

1. రాష్ట్రవ్యాప్తంగా అడవులు పునరుద్ధరణ:కేసీఆర్‌

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఆ వాగుతో అమరావతికి ముప్పు:విజయసాయి

వైకాపా ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సంప్రదించే తీసుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని.. అలాంటి వారందర్నీ చట్టపరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢ సంకల్పమన్నారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కొండవీటి వాగు వల్ల అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదముందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. అది భారత్ అంతర్గత వ్యవహారం: బంగ్లాదేశ్

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా ఏ కోశానా మద్దతు లభించడం లేదు. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్‌ కూడా భారత్‌ వైపే మొగ్గు చూపింది. ఇది భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని వెల్లడించింది. ‘ఆర్టికల్ 370 రద్దును భారత ప్రభుత్వ అంతర్గత వ్యవహారంగా బంగ్లాదేశ్ పరిగణిస్తోంది’ అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ‘రాజధాని మార్పుపై సమాచారముంది’

ఏపీ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని మాజీ ఎంపీ చింతా మోహన్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారనుందని.. దీనిపై కేంద్రంలోని పెద్దల నుంచి తనకు సమాచారముందని చెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి సౌకర్యాలూ లేని దొనకొండ కంటే తిరుపతి కొండ అయితే రాజధానికి బాగుంటుందని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. రైల్వే ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగులు

రైల్వేలో ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగులు పడుతున్నాయి. ప్రైవేట్‌ ఆపరేటర్లతో రైళ్లు నడిపేందుకు రంగం సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా దిల్లీ-లఖ్‌నవూ, అహ్మదాబాద్‌-ముంబయి మధ్య సెంట్రల్‌ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపే బాధ్యతను తమ అనుబంధ విభాగమైన ఐఆర్‌సీటీసీకి అప్పగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్ల టికెట్ల ధరల్ని నిర్ణయించే బాధ్యతని కూడా ఆ సంస్థకే రైల్వే బోర్డు కట్టబెట్టింది. ప్రైవేటు ఆపరేటర్లతో రైళ్లు నడిపే దిశగా ఇది ఒక ప్రయోగమని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అమెరికాలో గీతా స్థూపం ఏర్పాటు

7. ‘చిదంబరం ప్రతిష్ఠను దిగజార్చేందుకే అలా..’

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రతిష్ఠను దిగజార్చేందుకే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థలను మోదీ సర్కార్‌ వాడుకుంటోందని మండిపడ్డారు.ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం వ్యవహారంపై రాహుల్‌ ట్విటర్‌లో స్పందించారు. అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతూ మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోవడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. రూ.9కే విమానం టికెట్‌

వియత్నాంకు చెందిన వియెట్‌జెట్‌ సరికొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి దిల్లీ నుంచి ఈ సంస్థ తమ సర్వీసులను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా దీని ప్రచారం నిమిత్తం ‘గోల్డెన్‌ డేస్‌’ పేరుతో ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది. హనోయ్‌-దిల్లీ మార్గంలో డిసెంబర్‌ 7నుంచి వారానికి మూడు రిటర్న్‌ విమానాలను నడపనున్నారు.‘సూపర్‌ సేవింగ్‌ టికెట్స్’ పేరుతో ఆగస్టు 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.  టికెట్ల ధరలు రూ.9 నుంచి ప్రారంభమవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. బిస్కెట్లకూ తప్పని ఆర్థిక ముప్పు

ఆర్థిక రంగంలో మందగమనం బిస్కెట్ల తయారీ కంపెనీలపైనా ప్రభావం చూపుతోంది. దేశీయంగా అతిపెద్ద బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే భారీ సంఖ్యలో కార్మికులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విక్రయాలు భారీగా పడిపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. దేశీయంగా ఆటోమొబైల్‌, రిటైల్‌తో పాటు దాదాపు అన్ని రంగాలు నేల చూపులు చూస్తున్న వేళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కంపెనీలు ఉత్పత్తి, ఉద్యోగుల నియామకాలను తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. 11వేల దిగువకు నిఫ్టీ

దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభించిన బీఎస్‌ఈ  267.64 పాయింట్లు నష్టపోయి 37,060.37 వద్ద ముగిసింది. నిఫ్టీ 98.30 పాయింట్లు కోల్పోయి 11వేల మార్కు దిగువకు అంటే 10,918కి చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ 22 పైసలు తగ్గి 71.49 వద్ద స్థిరపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.