Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146122
            [news_title_telugu_html] => టాప్‌ 10 న్యూస్‌ - 1PM
            [news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ - 1PM
            [news_title_english] => one pm news
            [news_short_description] => 
            [news_tags_keywords] => top10,news,1pm
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 13:00:17
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
టాప్‌ 10 న్యూస్‌ - 1PM - one pm news - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1PM

1. పోలవరంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు..!

పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. చిదంబరాన్ని విచారిస్తున్న సీబీఐ

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరంను అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిన్న ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయనను కొందరు సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.  మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. చిదంబరం లొంగిపోవాల్సింది: సత్యపాల్‌ సింగ్‌

మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంపై  భాజపా ఎంపీ సత్యపాల్ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశరాజకీయాల్లో ఆయన ఎన్నో బాధ్యతలు చేపట్టారని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను నమ్మలేకపోతున్నానన్నారు. ‘‘చట్టం, న్యాయం గురించి తెలిసిన వ్యక్తి. కోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత ఆయన అలా చేసి ఉండకూడదు. ఇప్పుడేం జరుగుతుందో ఆయనకది మంచిది కాదు. కోర్టు ఆదేశాలిచ్చిన వెంటనే లొంగిపోయి ఉంటే ఆయన గౌరవాన్ని కాపాడుకునే వారు’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. సీబీఐ ద్వారా వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారా?

సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం అరెస్టును కాంగ్రెస్‌ ఖండించింది. ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శానాస్త్రాలు సంధించారు. రణ్‌దీప్‌ సుర్జేవాలా, సల్మాన్‌ ఖుర్షిద్‌ మీడియాతో మాట్లాడారు. ‘సీబీఐ, ఈడీలను కేంద్రం చేతిలోకి తీసుకుంది. వ్యక్తిగత ప్రతీకారాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటోంది. చిదంబరాన్ని అరెస్టు చేసిన తీరే ఇందుకు నిదర్శనం’అని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. జగన్‌..తుగ్లక్‌లా చేయొద్దు: కేశినేని

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మార్పు ప్రచారంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. రాజధానిని పదేపదే మార్చిన మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని, ఇప్పుడు మళ్లీ అదేపని చేసి  ముఖ్యమంత్రి జగన్‌ మరో తుగ్లక్‌లా చరిత్రలోకి ఎక్కకూడదని భవగంతుణ్ని కోరుకుంటున్నానంటూ ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సీఎంకు మురుగు నీరు.. నిందితుడి అరెస్టు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులకు పార్శిల్‌లో మురుగునీరు పంపిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా అతడిని సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉత్తరమండల టాస్క్‌ఫోర్సు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, కేటీఆర్‌, కవిత తదితర ప్రముఖులకు మంగళవారం ఓ అజ్ఞాతవ్యక్తి పార్సిళ్లు పంపిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మెగాస్టార్‌.. రఫ్ఫాడించేయండి

మెగాస్టార్‌ చిరంజీవి ఈ రోజు తన 64వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్‌, చిరంజీవి అనే హ్యాష్‌ట్యాగ్స్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి. ఆయన నిండు నూరేళ్లు చిత్ర పరిశ్రమను ఇలాగే రఫ్ఫాడించేయాలంటూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బెత్తం పట్టిన ఆర్‌బీఐ

దేశంలో నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల సంఖ్య పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మొత్తం 1,851 ఎన్‌బీఎఫ్‌సీల అనుమతులను రద్దు చేసింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 8రెట్లు ఎక్కువ. ఈ విషయాన్ని ఆర్‌బీఐనే సమాచారహక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించింది. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,700 ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రమే ఉన్నాయి. పదేళ్లలో ఇదే అత్యల్పం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. చాయ్‌ వాలా అవతారమెత్తిన మమతా బెనర్జీ

10. నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 245, నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.78గా ఉంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.