Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146183
            [news_title_telugu_html] => 

శేషాచలం అడవిలో.. అరుదైన జీవాలు..

[news_title_telugu] => శేషాచలం అడవిలో.. అరుదైన జీవాలు.. [news_title_english] => Seshachalam is a rare creature in the forest [news_short_description] => కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి నెలవైన శేషాచల అటవీ ప్రాంతం ప్రకృతి అందాలతో పాటు వేల జీవజాతులకు ఆలవాలం. అరుదైన జంతుజాతులు సంచరించే ఈ ప్రాంత ప్రత్యేకతతో పాటు ఆ జీవజాల విశిష్టతను భక్తులు, పర్యాటకులకు తెలిపేలా తితిదే ప్రణాళికలు రూపొందించింది. [news_tags_keywords] => Seshachalam forest, tirumala [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => aK6USVvC8gU [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 23:55:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
శేషాచలం అడవిలో.. అరుదైన జీవాలు.. - Seshachalam is a rare creature in the forest - EENADU
close

తాజా వార్తలు

శేషాచలం అడవిలో.. అరుదైన జీవాలు..

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి నెలవైన శేషాచల అటవీ ప్రాంతం ప్రకృతి అందాలతో పాటు వేల జీవజాతులకు ఆలవాలం. అరుదైన జంతుజాతులు సంచరించే ఈ ప్రాంత ప్రత్యేకతతో పాటు ఆ జీవజాల విశిష్టతను భక్తులు, పర్యాటకులకు తెలిపేలా తితిదే ప్రణాళికలు రూపొందించింది. వాటి సంరక్షణకు చర్యలు చేపట్టింది. పునుగుపిల్లి, మూసిక గొర్రె, కొండ గొర్రె, రేచికుక్క, అడవి కోడి, శేషాచల చిరుత ఇలా ఎన్నో వన్యప్రాణులుండే శేషాచలం అడవిలో మరెక్కడా కనిపించని ఎన్నో అరుదైన జీవజాతులు, వన్యప్రాణులను ఇక్కడ చూడవచ్చు. పార్వేటి మండపం, శ్రీగంధవనం, కుమారధార, పసుపుధార డ్యాం రోడ్డు, ధర్మగిరి, పాపవినాశనం ప్రాంతాల్లో పలు అరుదైన జీవజాతులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

శేషాచలం అడవి విస్తీర్ణం సుమారు 82500 ఎకరాలు కాగా తితిదే పరిధిలో ఉన్నది సుమారు 6750ఎకరాలు తమ పరిధిలోని అటవీ ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటుచేసిన తితిదే తరచుగా అరుదైన జీవులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించింది. అత్యాధునిక కెమెరాలు ఉపయోగించి రాత్రి వేళల్లో సంచరిస్తున్న వన్యప్రాణుల చాయా చిత్రాలను నిక్షిప్తం చేస్తూ అధ్యయనం సాగించింది. వీటికి ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించున్న తితిదే ఆయా ప్రాంతాల్లో వాటి సంచారానికి సంబంధించిన సూచికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సూచిక బోర్డుల ఏర్పాటు వల్ల భక్తులకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీచేయడానికి కూడా వీలవుతుందని తితిదే భావిస్తుంది. వీలైనంత త్వరగా వీటిని ఏర్పాచేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించింది.

 

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.