Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146238
            [news_title_telugu_html] => 

తండ్రి  డ్రైవర్‌.. కొడుకు  న్యాయమూర్తి..!

[news_title_telugu] => తండ్రి  డ్రైవర్‌.. కొడుకు  న్యాయమూర్తి..! [news_title_english] => Son Of Driver At Indore Court Qualifies Exam To Become Civil Judge [news_short_description] => తండ్రి న్యాయస్థానంలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తుంటే.. కొడుకు ఏకంగా న్యాయస్థానానికి న్యాయమూర్తే అయి తండ్రి కలను నెరవేర్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇండోర్‌లో ఓ యువకుడు న్యాయమూర్తి కావాలని ఆశించిన తండ్రి కలను నిజం చేశాడు. [news_tags_keywords] => civil judge,father driver at court,indore ,madyapradesh [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 20:10:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తండ్రి  డ్రైవర్‌.. కొడుకు  న్యాయమూర్తి..! - Son Of Driver At Indore Court Qualifies Exam To Become Civil Judge - EENADU
close

తాజా వార్తలు

తండ్రి  డ్రైవర్‌.. కొడుకు  న్యాయమూర్తి..!

ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌): తండ్రి న్యాయస్థానంలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తుంటే.. కొడుకు ఏకంగా న్యాయస్థానానికి న్యాయమూర్తే అయి తండ్రి కలను నెరవేర్చాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇండోర్‌లో ఓ యువకుడు న్యాయమూర్తి కావాలని ఆశించిన తండ్రి కలను నిజం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన చేతన్‌ బజద్‌(26) అనే యువకుడి తండ్రి స్థానిక న్యాయస్థానంలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తారు. ఆయనకు తన ముగ్గురు కుమారుల్లో ఎవరో ఒకరు న్యాయమూర్తి కావాలనే కల ఉండేది. ఇలా తన తండ్రికి ఉన్న కలను లక్ష్యంగా పెట్టుకున్న చేతన్‌ ఎంతో కష్టపడి చదివి సివిల్‌ జడ్జి క్లాస్‌ 2 నియామక పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. బుధవారం మధ్యప్రదేశ్‌ హైకోర్టు పరిధిలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు విడుదల చేయగా.. ఓబీసీ కేటగిరిలో చేతన్‌ 13వ ర్యాంకు సాధించారు. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష రెండింటిల్లో కలిపి మొత్తం 450 మార్కులకు గానూ 257.5 సాధించాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చేతన్‌.. తన తండ్రి కలను సాకారం చేసేందుకు తాను ఎంతో శ్రమించానని అన్నారు. తాను ఈరోజు ఈ ఉద్యోగాన్ని సాధించడానికి తన తండ్రి గోవర్ధన్‌ లాల్‌ ఆదర్శమని తెలిపారు. న్యాయమూర్తి స్థానంలో కూర్చున్న తర్వాత బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడమే తన అంతిమ లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.