close

తాజా వార్తలు

కొత్త ఎక్సైజ్‌ పాలసీ ప్రకటించిన ప్రభుత్వం

అమరావతి: ఏపీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటించింది. 2019-20 ఏడాదికి దీన్ని తీసుకొచ్చింది. మద్యం దుకాణాల ఏర్పాటు నిబంధనలతో సవివరంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాదికి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల సంఖ్యను 3,500కు పరిమితం చేసింది. మద్యం దుకాణాల లైసెన్సులు ఈ ఏడాది అక్టోబర్ 1నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ స్టేట్ బేవరేజెస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌కు షాపుల ద్వారా మద్యం విక్రయించే హక్కు కల్పించింది. దీనికి అనుగుణంగా అక్టోబర్ 1 నుంచి దుకాణాలను నడపనుంది. జాతీయ రహదారులపై  మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రతి మద్యం దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.