Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000021
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ @ 5 PM [news_title_english] => FIVE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS,5 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 17:00:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ @ 5 PM - FIVE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM
test test

1. ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేకస్థానం’

భారత్‌- ఫ్రాన్స్‌ సంబంధాలు ఈనాటివి కాదని.. కష్టనష్టాల్లో ఈ రెండు దేశాలూ పరస్పరం సహకరించుకుంటాయిన ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నాలుగేళ్ల క్రితం తాను ఫ్రాన్స్‌ వచ్చినపుడు వేలాదిమంది భారతీయులు తనను అభినందించారని గుర్తు చేసుకున్నారు. ఫ్రాన్స్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. నవభారత్‌ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగే కాదు.. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ భారత్‌కు ప్రత్యేక స్థానముందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అందుకే కృష్ణానదికి వరదలొచ్చాయి‌: చంద్రబాబు

తన ఇల్లు ముంచాలనే ఉద్దేశంతో కృష్ణా నదీపరివాహక ప్రాంతాలన్నీ ముంచారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరదలు ప్రకృతి వైపరీత్యం వల్ల కాదని.. ప్రభుత్వ వైపరీత్యమే అని ఎద్దేవా చేశారు. తన ఇంటిని ముంచే కుట్రతో ప్రజలను నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని నియంత్రించడానికి అవకాశం ఉన్నప్పటికీ అలా చేయలేదని.. రాజధానిని వరద నీటితో ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైకాపా ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అవన్నీ అవాస్తవాలే: ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒక్క మెగావాట్‌ కూడా ఉత్పత్తి కాలేదని చేస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవాలేనని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎంతో పారదర్శకంగా విద్యుత్‌ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని ఆయన చెప్పారు. విద్యుత్‌ సంస్థలు స్వతంత్ర సంస్థలని.. మాపై ఎటువంటి ఒత్తిడులు లేవని వివరించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తూ పారదర్శకంగా పనిచేస్తున్నామని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఫోక్స్‌ వ్యాగన్‌ కేసులో మంత్రి బొత్సకు సమన్లు

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న హాజరుకావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది. వైఎస్‌ సర్కారులో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో కీలక సాక్షిగా ఉన్నారు. విశాఖపట్నంలో జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ ఏర్పాటు చేస్తామని పలువురు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారనేది కేసులో ప్రధాన అభియోగం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పవన్‌పై బ్లాక్‌మనీ ప్రచారం: వైకాపాపై ఫిర్యాదు

వైకాపా సోషల్‌ మీడియా విభాగంపై జనసేన నేతలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియాలో జనసేనపై దుష్ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బ్లాక్‌మనీని వైట్‌మనీగా చేశారంటూ వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో జనసేన నేతలు పేర్కొన్నారు. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా రూ.2వేల కోట్ల బ్లాక్‌మనీని మార్చారంటూ వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని  మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మోదీ విధానాలకు కాంగ్రెస్ నేతల కితాబు

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే ప్రతినిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వ్యాఖ్యలకు అదే పార్టీకి చెందిన మరో ముఖ్య నేత అభిషేక్‌ మను సింఘ్వీ సైతం గొంతు కలిపారు. మోదీని విలన్‌గా చిత్రీకరించడం తప్పని వ్యాఖ్యానించారు. ‘‘మోదీని విలన్‌గా చిత్రీకరించడం తప్పని చెబుతూనే ఉన్నా. ఇది ఒకరకంగా ఆయనకి మేలు చేస్తోంది. విధానాల్లో మంచి, చెడు ఉండొచ్చు. వాటిని అంశాలవారీగానే చూడాలి. వ్యక్తి ఆధారంగా వాటిని అంచనా వేయొద్దు. ఆయన చేపట్టిన అనేక మంచి పనుల్లో ఉజ్జ్వల కార్యక్రమం ఒకటి’’ అని సింఘ్వీ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘సూపర్‌ రిచ్‌’ నుంచి ఎఫ్‌పీఐలకు మినహాయింపు!

ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులను సంతృప్తి పరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యంత ధనవంతులపై విధించే సర్‌ఛార్జి నుంచి వారికి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు ఆర్థిక మందగమనం నేపథ్యంలో మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా ఎఫ్‌పీఐ విషయంలో తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 17 పాక్‌ నంబర్లకు వాట్సాప్‌ కాల్స్‌!

అనుమానిత ఉగ్రవాదులుగా అరెస్టయిన ముగ్గురు యువకుల నుంచి పాక్‌ ఫోన్‌ నంబర్లకు సమాచారం వెళ్లినట్టు మధ్యప్రదేశ్‌ పోలీసులు గుర్తించారు. సాత్నా జిల్లా పోలీసులు ముగ్గురు యువకుల్ని అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏటీఎస్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు నిందితుల ఫోన్లను సీజ్‌ చేశారు. వాటిని పరిశీలించగా.. ఈ ముగ్గురి ఫోన్‌ల నుంచి పాక్‌కు చెందిన 17 నంబర్లతో సంప్రదింపులు జరిగినట్టు గుర్తించారు. నిరంతరం వాట్సాప్‌ కాల్స్‌, వీడియో సందేశాలను పాక్‌కు చెందిన నంబర్లకు పంపినట్టు తేల్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మార్కెట్లకు లాభాలొచ్చాయోచ్‌..

గత మూడు రోజులుగా భారీ నష్టాలతో సతమతమవుతున్న దేశీయ మార్కెట్లు ఎట్టకేలకు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. ఉద్దీపన చర్యలతో పాటు సంపన్నులపై సర్‌ఛార్జీని ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆరంభ నష్టాల నుంచి సూచీలు తేరుకున్నాయి. నేటి ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. మొత్తంగా నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 228 పాయింట్లు ఎగబాకి 36,701 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,829 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.66గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.