close

తాజా వార్తలు

సచివాలయ భూములపై గవర్నర్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌: సచివాలయ సొసైటీ భూముల అక్రమాలపై ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్‌ నరసింహన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి సచివాలయంలో 11 గుర్తింపు పొందిన సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న గృహనిర్మాణ సొసైటీ.. 2002లో గృహనిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందన్నారు. దీనిపై స్పందించిన అప్పటి ప్రభుత్వం.. వివిధ ప్రాంతాల్లో 976 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. గోపన్‌పల్లిలో 477 ఎకరాలు, గచ్చిబౌలిలో 38 ఎకరాలు, నేక్‌నాపూర్‌లో 59 ఎకరాలు, జవహర్‌నగర్‌లో 100 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. 

ఈ వ్యవహారంలో సొసైటీ అధ్యక్షుడు, ఇతర డైరెక్టర్లు మొదటి నుంచి అవకతవకలకు పాల్పడటంతో అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. దీనిలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి విజిలెన్స్‌ విభాగం 2010 జులై 29న నివేదిక అందజేసినట్లు పద్మనాభరెడ్డి వివరించారు. 

ప్లాట్ల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు విజిలెన్స్‌ నిగ్గు తేల్చిందన్నారు. దీనిపై విజిలెన్స్‌ విభాగం పలు సిఫార్సులతో కూడిన నివేదిక ప్రభుత్వానికి అందచేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల నాటి విజిలెన్స్‌ నివేదికపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు పద్మనాభరెడ్డి వివరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.