close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. పోలవరంపై కేంద్రానికి పీపీఏ నివేదిక

పోలవరంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నివేదిక అందజేసింది. ప్రాజెక్టు ఇప్పటికే నాలుగేళ్లు ఆలస్యమైందని.. ఏపీ ప్రభుత్వ వైఖరితో ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులూ తలెత్తుతాయని పీపీఏ పేర్కొంది. 12 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ వల్ల జరిగే నష్టాలను నివేదికలో పీపీఏ సవివరంగా పొందుపరిచింది. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో మరింత జాప్యం జరిగే అవకాశముందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రెపోరేటుకు అనుగుణంగా గృహ,వాహన రుణాలు

ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. సూపర్‌ రిచ్‌ సర్‌ఛార్జి నుంచి విదేశీ సంస్థాగత మదుపరులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై రెపోరేటుకు అనుగుణంగానే వడ్డీ, వాహన రుణాలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమందగమనం ఉందని పేర్కొన్నారు. సంపద సృష్టించేవాళ్లను ప్రోత్సహిస్తామన్నారు. రెపో రేట్లకు అనుగుణంగానే గృహ, వాహన రుణాలపై భారం తగ్గనుందన్నారు. ఈ తగ్గింపుతో గృహ, వాహన రుణాల వాయిదాలు అనుసంధానమవుతాయని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తిరుపతిలో రెడ్‌అలర్ట్‌

ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘నాపై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు’

భాజపాలో చేరుతున్నట్లు వస్తోన్న వార్తలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ కలవడం లేదని.. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. దామోదర రాజనర్సింహ పార్టీ మారుతున్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బీఎస్‌-IV వాహనాలపై కేంద్రం స్పష్టత

బీఎస్‌-IV వాహనాల కొనుగోలు విషయంలో నెలకొన్న గందరగోళానికి కేంద్రం తెరదించింది. ఈ వాహనాలను 2020 మార్చి వరకు కొనుగోలు చేయొచ్చని, రిజిస్ట్రేషన్‌ గడువు పూర్తయ్యే వరకు నడపవచ్చని స్పష్టతనిచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయం అటు వాహన తయారీ కంపెనీలకు, ఇటు వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం కానుంది. వాహన కొనుగోళ్లకు ఇది ఊతమివ్వనుంది. భారత్‌ స్టేజ్‌-VI ప్రమాణాలు కలిగిన వాహనాలను 2020 ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విశాఖలో కాలి బూడిదైన సెల్‌ టవర్‌

మద్దిలపాలెంలోని సీఎంఆర్‌ సెంట్రల్‌ సమీపంలో విద్యుత్‌ షార్ట్ ‌సర్క్యూట్‌ కారణంగా పెట్రోల్‌ బంక్‌‌ సమీపంలోని సెల్‌ఫోన్‌ టవర్‌ కాలి బూడిదయింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటన జరిగిన సమయంలో వర్షం పడుతుండడం వల్ల మంటలు వ్యాప్తి చెందలేదని స్థానికులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మరో షాకిచ్చిన అంబటి రాయుడు

టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు! తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం రాయుడు టీఎన్‌సీఏ వన్డే లీగ్‌లో గ్రాండ్‌శ్లామ్‌ జట్టుకు ఆడుతున్నాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ భారత్‌ తరుఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తిరిగి అడుగుపెట్టాలన్న యోచనలో ఉన్నట్టు చెప్పాడట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎవరూ భయపడొద్దు: కోయంబత్తూర్‌ సీపీ

లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు కొయంబత్తూర్‌లోకి చొరబడినట్టు నిఘా వర్గాలకు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌ నగరంలో 2వేల మంది పోలీసులను మోహరించినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ సుమిత్‌ శరన్‌ వెల్లడించారు.  షాపింగ్‌ మాల్స్‌, ఆలయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లోనూ పోలీసులను మోహరించామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కృష్ణాష్టమి వేడుకల్లో రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు

10. నిలకడగా ఆడుతున్న జడేజా

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జడేజా(45*), ఇషాంత్‌శర్మ(19) నిలకడగా ఆడారు. మరోవైపు విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నారు. రెండో రోజు ఆటను ప్రారంభించిన కొద్ది సేపటికే కీమర్‌ రోచ్‌ విండీస్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. ఇషాంత్‌ను గాబ్రియేల్‌ బౌల్డ్‌ చేశాడు. తొలి రోజు మూడు వికెట్లు తీసిన అతడు ఈసారి రిషభ్‌పంత్‌(24) బోల్తాకొట్టించాడు. క్రీజ్‌లో జడేజా, బుమ్రా ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.