close

తాజా వార్తలు

వయసు ఎనిమిది..కారు స్పీడు గంటకు 140

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎనిమిదేళ్ల చిన్నోడు..లోక జ్ఞానమే సరిగా తెలిసి ఉండదు. అలాంటిది హైస్పీడ్‌ కారు స్టీరింగ్‌ పట్టాడు. సరదాగా కాసేపు కారు నడపాలన్న కోరికతో ఏకంగా ఆ కారునే కొట్టేశాడు. అదీ ఎవరిదో కాదు..ఆ చిన్నోడి తల్లిదండ్రులదే. ఆ కారు స్పీడు గంటకు 140కి.మీ. ఆ వయసులో ఊహకందని స్పీడది. తన స్నేహితులు కారులో షికారు చేస్తుంటే...జర్మనీకి చెందిన ఈ చిన్నారికి మాత్రం ఏకంగా కారు నడపాలనే కోరిక కలిగింది. దీంతో తల్లిదండ్రుల నుంచి కారు దొంగిలించి  జర్మనీ వీధుల్లో తిప్పాడు. అలా తిరుగుతుండగా కారు స్పీడు పెరగడంతో భయమేసి కారు ఆపేశాడు. ఈ లోగా ఆ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఆటోమేటిక్‌ వీడబ్ల్యూ గోల్ఫ్‌కారుతో సహా తమ కుమారుడు కూడా కనిపించలేదని చెప్పింది. పోలీసులు వెతకడం ప్రారంభించగా..డోర్టమండ్‌ అనే ప్రాంతంలో కారు ఆపి ఉన్న బుడతడిని పోలీసులు పట్టుకున్నారు. తర్వాత తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఇంతకీ పోలీసులకు ఆ బుడతడు ఏం చెప్పాడో తెలుసా? చిన్న వయసులో కారు నడిపి, అందరితోనూ శభాష్‌ అనిపించుకోవాలనిపించిందట. అందుకే తల్లిదండ్రుల కారును తీసుకెళ్లి మరీ వారిని కంగారు పెట్టాడు. ఈ విషయాన్ని జర్మనీ పోలీసులు ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా చెప్పుకొచ్చారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.