Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146671
            [news_title_telugu_html] => 

బ్రిటన్‌ ప్రధాని.. ట్రంప్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌

[news_title_telugu] => బ్రిటన్‌ ప్రధాని.. ట్రంప్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ [news_title_english] => Boris Johnson puts his feet up in Macrons palace [news_short_description] => బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాసన్..ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్‌ మెక్రాన్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. బోరిస్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఫ్రాన్స్‌ పర్యటనకు వచ్చారు............. [news_tags_keywords] => Boris Johnson,Emmanuel Macron [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164601751657439232 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 11:14:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బ్రిటన్‌ ప్రధాని.. ట్రంప్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ - Boris Johnson puts his feet up in Macrons palace - EENADU
close

తాజా వార్తలు

బ్రిటన్‌ ప్రధాని.. ట్రంప్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌

అనుచిత ప్రవర్తనతో విమర్శలెదుర్కుంటున్న బోరిస్‌ జాసన్‌

పారిస్‌: బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాసన్..ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మన్యుయేల్‌ మెక్రాన్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. బోరిస్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఫ్రాన్స్‌ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మెక్రాన్‌ ముందు ఉన్న టీ పాయ్‌ మీద బోరిస్‌ కాలు పెట్టి మీడియా ప్రతినిధులకు ‘హాయ్‌’ చెప్పారు. తర్వాత మెక్రాన్‌తో ముచ్చట్లు మొదలు పెట్టారు. బోరిస్ అలా ప్రవర్తించినప్పటికీ మెక్రాన్‌ మాత్రం ఇబ్బంది పడకుండా నవ్వుతూ ఉండటం గమనార్హం. 

ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని స్థాయి వ్యక్తి సాటి అధినేత పట్ల ప్రవర్తించిన తీరు అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. బోరిస్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోలుస్తున్నారు. ట్రంప్‌ సైతం చాలా సందర్భాల్లో తన దుందుడుకు వ్యాఖ్యలతో వివాదాల్లో నిలిచారని కామెంట్లు చేస్తున్నారు. ‘గర్వంతో కూడిన ప్రవర్తన, డొనాల్డ్‌ ట్రంప్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌’,‘పద్ధతి తెలీని వ్యక్తి.. రెండో డొనాల్డ్‌ ట్రంప్‌’అని కామెంట్లు పెడుతున్నారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.