
తాజా వార్తలు
పూజల పేరుతో రూ. 13 లక్షలకు టోకరా
జూబ్లీహిల్స్: నగలు మూటకట్టి గంగలో ముంచితే రెట్టింపు అవుతాయంటూ అదేదో సినిమాలో కామెడీ పండించినట్లు.. పూజలు చేసి డబ్బును మూడింతలు చేస్తామని చెప్పి ముగ్గురు వ్యక్తులు ఓ అమాయకుడికి టోకరా వేసి రూ. 12.60 లక్షల మేర మోసం చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కన్నెపల్లికి చెందిన బండారి రత్నయ్య (45) హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఉంటూ కార్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. మే నెలలో సొంతూరికి వెళ్లిన రత్నయ్య.. జాఫర్ అనే స్నేహితుడికి తన ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పి వాపోయాడు. అతడు తన మిత్రుడైన ప్రభాకర్‌కు మహారాష్ట్రలో ఉండే మౌలాలా మహమ్మద్ ఇర్ఫాన్ అనే బాబా తెలుసని, అతనికి రూ. 12 లక్షలిస్తే పూజలు చేసి ఆ సొమ్మును మూడింతలు చేస్తాడని నమ్మించి ప్రభాకర్‌ను పరిచయం చేశాడు. ఆశపడిన రత్నయ్య హైదరాబాద్ చేరుకుని ముందుగా రూ. 3.60 లక్షలు సిద్ధం చేసి బాబాకు ఫోన్ చేశాడు. అతని సూచనల మేరకు మే 2న రూ. 1.10 లక్షలు ప్రభాకర్ ఖాతాలోనూ, మరో రూ. 2 లక్షలు ఇర్ఫాన్ బాబా ఖాతాలోనూ వేశాడు. అదేనెల 17 ఇర్ఫాన్, జాఫర్, ప్రభాకర్‌లు హైదరాబాద్‌లోని రత్నయ్య ఇంటికి వచ్చారు. అప్పటికి రత్నయ్య అప్పులు చేసి, ఇంట్లో బంగారాన్ని అమ్మి మిగిలిన రూ. 9.90 లక్షలు సిద్ధం చేశాడు. ఆ సొమ్ము తీసుకున్న ఇర్ఫాన్ తనతోపాటు తెచ్చిన ఒక పెద్దబ్యాగును తెరిచి రత్నయ్య కుటుంబ సభ్యులకు చూపించాడు. అందులో రూ. 50 లక్షలు ఉన్నాయని నమ్మించాడు. 15 రోజులపాటు నిష్టగా పూజ చేయాలని తర్వాత ఆ సొమ్మును సొంతం చేసుకోవచ్చని తెలిపాడు. కాసేపు ఏవో పూజలు చేసినట్లు నమ్మించి రత్నయ్య ఇచ్చిన రూ. 9.90 లక్షలు తీసుకుని వారు ఉడాయించారు. 15 రోజులపాటు పూజలు చేసిన తర్వాత రత్నయ్య బ్యాగు తెరిచి చూడగా అందులో పైపైన కొన్ని కరెన్సీ నోట్లు.. మిగలినవన్నీ తెల్లకాగితాలు కనిపించాయి. కంగారుపడ్డ అతడు ఇర్ఫాన్‌కు ఫోన్ చేశాడు. పూజలో ఏదో లోపం జరిగిందని బ్యాగు తీసుకొని మహారాష్ట్ర రావాలని చెప్పాడు. తర్వాత ఫోన్లోనూ అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని గుర్తించారు. గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇర్ఫాన్, జాఫర్, ప్రభాకర్‌లపై కేసులు నమోదయ్యాయి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
