Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000457
            [news_title_telugu_html] => 

పిండి బొమ్మను చేసి..పాపాయిగా చిత్రీకరించి..

[news_title_telugu] => పిండి బొమ్మను చేసి..పాపాయిగా చిత్రీకరించి.. [news_title_english] => Baby made of dough woman tries to get govt scheme money [news_short_description] => మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ పరిధిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో సజీవ సాక్ష్యం ఈ ఘటన. బాలింతలకు ...... [news_tags_keywords] => ANM,ASHA,Baby [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 11:30:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పిండి బొమ్మను చేసి..పాపాయిగా చిత్రీకరించి.. - Baby made of dough woman tries to get govt scheme money - EENADU
close

తాజా వార్తలు

పిండి బొమ్మను చేసి..పాపాయిగా చిత్రీకరించి..

భోపాల్‌ ఆసుపత్రిలో మహిళ హల్‌చల్‌

మొరేనా: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ పరిధిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ ఘటన. బాలింతలకు మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తూ చేయూత నిస్తోంది. ఆ డబ్బుల కోసం ఆశపడి ఓ మహిళ అడ్డదారి తొక్కింది. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. 

రాష్ట్రంలోని మొరేనా జిల్లా పరిధిలో ఉన్న కైలారాస్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ..ప్రభుత్వం ఇచ్చే డబ్బులకు ఆశపడి వైద్యులనే పక్కదారి పట్టించింది. పిండి బొమ్మను చేసి తనకు బిడ్డ పుట్టిందని చిత్రీకరించి ప్రభుత్వ సంక్షేమపథకంలో తన పేరు, తన బిడ్డ పేరు నమోదు చేయించాలని స్థానిక ఆశావర్కరును కోరింది. పేరు నమోదు చేయించేలా  ఆమెను మభ్యపెట్టింది. పిండి ముద్దను బిడ్డ రూపంలో తయారు చేసి, ఒక వస్త్రంలో చుట్టి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రిలో వైద్యులు బిడ్డకు టీకా వేయాల్సిందిగా సూచించడంతో అసలు విషయం బయట పడింది. ఆ మహిళ చేసిన పనికి విస్తుపోవడం వైద్యుల వంతైంది.

దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌ఆర్‌ మిశ్రా మాట్లాడుతూ..‘ఆ మహిళ చేసిన పనికి నేను షాక్‌ అయ్యాను. పరీక్షల నిమిత్తం చిన్నారిని తీసుకురమ్మనప్పుడు ఆమె నిరాకరించింది. బిడ్డను చూడగానే ఎరుపు రంగులో ఉంది. తీరా చూసిన తర్వాత అది పాపే కాదు. బొమ్మని తెలిసింది. నా కెరీర్‌లో ఇలాంటి ఘటన అనుభవంలోకి రావడం ఇదే తొలిసారి. పేద బాలింతలకు ప్రభుత్వం సాయం చేస్తుంటే కొందరు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు ఆశపడి ఇలా అడ్డదార్లు తొక్కుతున్నారు.’ అని తెలిపారు.

పేద గర్భిణులు, బాలింతల పోషకావసరాల కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం శ్రామిక్‌ సేవా ప్రసూతి సహాయతా యోజనా పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది.  బాలింతకు పోషకావసరాల కోసం రూ.1400 తక్షణ ఆర్థిక సాయం కింద ఇస్తారు. ఆసుపత్రుల్లో ప్రసవాల రేటును పెంచడానికి బాలింతలకు ప్రోత్సాహం కింద రూ.16 వేలు ఆర్థిక సాయం చేస్తోంది. ఈ డబ్బులకు ఆశపడే ఆ మహిళ అడ్డంగా దొరికి పోయింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.