Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000521
            [news_title_telugu_html] => టాప్‌ 10 న్యూస్‌ - 1PM
            [news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ - 1PM
            [news_title_english] => one pm news
            [news_short_description] => 
            [news_tags_keywords] => top10,news,1pm
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-24 13:00:27
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
టాప్‌ 10 న్యూస్‌ - 1PM - one pm news - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1PM

1. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ కన్నుమూత

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు తెలిపారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పోలవరాన్ని ఆపడం మంచిది కాదు: సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబుకు మంచిపేరు వస్తుందని ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం జరగాలని కోరారు. విజయవాడలో నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఈ కేవైసీ తిప్పలు.. కిలోమీటర్ల బారులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఈ కేవైసీ తిప్పలు తప్పడం లేదు. రేషన్‌ పొందాలంటే ఆధార్‌ అనుసంధానం తప్పని సరికావడంతో ప్రజలు పెద్ద ఎత్తున నమోదు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. నమోదుకు ప్రభుత్వం గడువు పొడిగించినప్పటికీ కేంద్రాల వద్ద ప్రజల తాకిడి తగ్గడం లేదు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రధాన మీసేవా కేంద్రం వద్ద ఆధార్‌ కోసం శనివారం ఉదయం నుంచి ప్రజలు బారులు తీరారు. సుమారు 4000 మందికిపైగా తరలివచ్చారు. కానీ, ఇక్కడి సిబ్బంది 2000 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. దేశ వర్తమానం..భవిష్యత్‌ మోదీయే:రాంమాధవ్‌

దేశ వర్తమానం..భవిష్యత్‌ ప్రధాని మోదీయే అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ అన్నారు. గడిచిన 2 నెలల్లో చాలామంది ప్రముఖులు భాజపాలో చేరారని గుర్తు చేశారు. తిరుపతిలో రామ్‌మాధవ్‌, ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ సమక్షంలో తెదేపా సీనియర్‌నేత సైకం జనార్ధన్‌రెడ్డి భాజపాలో చేరారు. గతంలో ఆయన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా పని చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వరద బాధితులకు కాలం చెల్లిన నూనె!

గుంటూరు జిల్లాలో పౌరసరఫరా శాఖ అధికారుల నిర్లక్ష్యం వరద బాధితుల్లో ఆందోళన పెంచింది. కొల్లూరు మండలం లంకగ్రామాల్లోని వరదబాధితుల కోసం ప్రభుత్వం అందించిన నిత్యావసరాల్లో కాలం చెల్లిన పామాయిల్‌ నూనె ప్యాకెట్లను సరఫరా చేశారు. వరద ముంపుతో రోగాల బారిన పడిన తమకు.. కాలం చెల్లిన సరకులతో మరింత అనారోగ్యానికి గురి చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తుపాకుల మోత

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లా అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లింది. అబుజ్‌మాఢ్‌ ప్రాంతంలో భద్రతాసిబ్బంది, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు భద్రతాసిబ్బందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శ్రీనగర్‌ బయలుదేరిన విపక్ష బృందం

కశ్మీర్‌లో పర్యటించాలన్న విపక్షాల నిర్ణయం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. రాహుల్‌ గాంధీతో కూడిన విపక్ష బృందం దిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌’

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధిని వేగిరం చేయడానికి భారత్‌ తీసుకున్న నిర్ణయాలను అమెరికా వ్యాపార వర్గాలు స్వాగతించాయి. శుక్రవారం నాటి మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన పలు ఉద్దీపన కార్యక్రమాలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశం మెండుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో భారత్‌ అంతర్జాతీయంగా పెట్టుబడుల కేంద్రంగా కొనసాగనుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. చైనాకు చాలదనుకుంటా.. డోసు పెంచండి..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు టారీఫ్‌ల డోసు పెంచారు. అమెరికా వస్తువులపై టారీఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ తన ట్విటర్‌ కరవాలాన్ని చైనాపై దూశారు.  చైనాకు చెందిన దాదాపు 550 బిలియన్‌ డాలర్లు విలువైన ఉత్పత్తులపై 5శాతం టారీఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కశ్మీర్‌,ఊటీ ఆదిలాబాద్‌ అడవుల్లోనే


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.