Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000593
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM [news_title_english] => FIVE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS, 5 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 16:59:52 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM - FIVE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. జైట్లీ మృతి.. తెలుగు ప్రముఖుల సంతాపం

భాజపా సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ (66) మృతిపట్ల పలువురు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని పలువురు నేతలు అభిప్రాయడ్డారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచారం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రేపు జైట్లీ అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఈ మేరకు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్‌ నుంచి  ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఈ రోజు రాత్రి కైలాశ్‌ కాలనీలోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు భాజపా కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఫైనల్‌ చేరిన పీవీ సింధు

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ తార పూసర్ల వెంకట సింధు తనపై అంచనాలు నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ప్రత్యర్థి, నాలుగో సీడ్‌ యూఫీచెన్‌ (చైనా)ను 21-7, 21-14 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. మూడో సారి ఫైనల్‌కు చేరుకొని పసిడి పోరుకు బాటలు వేసుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. రాజధాని తరలించకూడదు: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని, రాష్ట్రమంతటిదని చెప్పారు. హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో పవన్‌తో రాజధాని ప్రాంత రైతుల బృందం శనివారం కలిసింది. రాజధాని పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈ సందర్భంగా వారు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. భారత్‌ నెమ్మదిస్తుంది.. కానీ..!

ఆర్థిక మందగమనం నేపథ్యంలో భారత్‌ జీడీపీ 2019లో 6.2కు మాత్రమే పరిమితం అవుతుందని ప్రముఖ  రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ పేర్కొంది. గతంలో ప్రకటించిన 6.8శాతం కంటే ఇది చాలా తక్కువ. ఇక 2020లో భారత ఆర్థిక వ్యవస్థ 6.7శాతంతో వృద్ధి సాధిస్తుందని తెలిపింది. దీనిలో కూడా 0.6శాతం కోత విధించింది. ఈ అంచనాలే నిజమైతే భారత్‌ వృద్ధిరేటును చైనా వృద్ధిరేటు సమానం చేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. హిమాచల్‌లో ప్రయాణికుల సాహసం

7. దిల్లీ బయల్దేరిన వెంకయ్యనాయుడు

భాజపా సీనియర్‌నేత అరుణ్‌జైట్లీ (66) మృతి చెందడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న ఆయన ఉన్నపళంగా దిల్లీ బయల్దేరి వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుణ్‌ జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని, అత్యంత సన్నిహితుల్లో ఒకరని అన్నారు. జైట్లీ మృతి దేశానికి, వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటు అని చెప్పారు. ‘జైట్లీ ఓ ఉత్తమ పార్లమెంటేరియన్‌, న్యాయకోవిదుడు’అని కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘అలా చేయమని మోదీకి భాజపా నేతలు సూచించారా?’

ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు తగవని, విధానాలపై మాత్రమే వ్యాఖ్యానించాలని కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ సమర్థించారు. భాజపా నేతలు అలా చేయగలరా అని ప్రశ్నించారు. ప్రతిసారీ ప్రతిపక్షాన్ని విలన్‌గా చూపడం ఆపాలని మోదీకి ఎప్పుడైనా సూచించారా అని అడిగారు. పార్టీలకతీతంగా మంచి పనులను మెచ్చుకునే సాంప్రదాయం కేవలం కాంగ్రెస్‌ వారికి మాత్రమే ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఇంట్లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎడపల్లిలో ఉన్న అతడి నివాసం మొదటి అంతస్తులో తెల్లవారుజామున 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేడు. భార్యా పిల్లలు మాత్రమే ఉన్నారు. అయితే వారు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. రాహుల్‌గాంధీని వెనక్కి పంపిన పోలీసులు

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షించడానికి శ్రీనగర్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు తిరిగి వెనక్కి పంపించారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పటి నుంచి కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు అక్కడ నెలకొన్న పరిస్థితులపై మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా, పలు ప్రతిపక్ష పార్టీల నేతలు జమ్మూకశ్మీర్‌ పర్యటనకు బయలుదేరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.