Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000656
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ @ 9 PM [news_title_english] => NINE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS, 9 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 21:00:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ @ 9 PM - NINE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. రాజధానిపై అలా అన్లేదు: బొత్స

రాజధాని మారుస్తున్నామని తాను ఎక్కడా అనలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను పక్కన పెట్టి నారాయణ కమిటీ నివేదిక ప్రకారం అమరావతిని ఎంపిక చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి స్వార్థం, స్వలాభం కోసమే ఆలోచించి అలా చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందనే చెప్పాను తప్ప.. రాజధానిని మారుస్తున్నారని చెప్పలేదని బొత్స స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. యుఏఈలో రూపే కార్డు విడుదల..!

భారత ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈలో శనివారం రూపే కార్డును అధికారికంగా విడుదల చేశారు. భారత్‌ -యుఏఈ వ్యాపారం మరింత వృద్ధి చెందడానికి ఇది దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత రూపే కార్డును ప్రారంభించిన తొలిదేశం యుఏఈనే కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కాంస్యంతో సరి:సెమీస్‌లో సాయి ప్రణీత్‌ ఓటమి

బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయి ప్రణీత్‌ ప్రస్థానం ముగిసింది. అతడు కాంస్య పతకానికే పరిమితం అయ్యాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో టాప్‌సీడ్‌ కెంటో మోమోటా (జపాన్‌)తో జరిగిన పోరులో 13-21, 8-21 తేడాతో ఓటమి చవిచూశాడు. ఐతే పురుషుల విభాగంలో 36 ఏళ్ల తర్వాత పతకం గెలిచిన భారత ఆటగాడిగా అతడు ఘనత సాధించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ‘గవర్నరే నన్ను కశ్మీర్‌కు ఆహ్వానించారు’

జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేవని అర్థమవుతోందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం జమ్మూకశ్మీర్‌ వెళ్లేందుకు విపక్ష నేతల బృందం ప్రయత్నించగా.. వారిని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని తిరిగి దిల్లీకి పంపారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తనను కశ్మీర్‌కు ఆహ్వానించారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. హైదరాబాద్‌లో 26 నుంచి నీటి సరఫరా బంద్‌

భాగ్యగరంలోని ప‌లు ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా ఆగిపోనుంది. ఈ నెల 26, 27వ తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, 28, 29 తేదీల్లో మరికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు వెల్లడించారు. గండిపేట నుంచి అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌కు నీటి తరలింపులో పైపులైన్‌ కాలువ మరమ్మతులు, అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌ క్లీనింగ్‌ దృష్ట్యా 26, 27 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. విజయవాడ శారద జూనియర్‌ కళాశాలలో ‘కళాంజలి’ ఫ్యాషన్‌ షో

7. 222 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య కరీబియన్‌ జట్టు 222 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 189/8తో ఆట ఆరంభించిన విండీస్‌ 74.2 ఓవర్లకు 222/10 పరుగులు చేసింది. రోస్టన్‌ చేస్‌ 48(74), జేసన్‌ హోల్డర్‌ 39(65) హెట్‌మెయిర్‌ 35(47)లు మాత్రమే అత్యధిక పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 5 వికెట్లు తీయగా, షమీ, రవీంద్ర జడేజా రెండేసి, బూమ్రా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ‘రివర్స్‌’తో ధర పెరగదు: మంత్రి అనిల్‌

పోలవరం హెడ్‌వర్క్స్‌కు సంబంధించి రివర్స్‌ టెండర్లకు వెళ్లొద్దని హైకోర్టు చెప్పలేదని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. హెడ్‌వర్క్స్‌, జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు వేర్వేరుగా టెండరింగ్‌ వెళ్లాలా? లేదా? అనేది ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ధరలు పెరుగుతాయోమే అని పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమానిస్తోందని, రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఎట్టి పరిస్థితిల్లోనూ ధర పెరిగే ఆస్కారం లేదనే విషయాన్ని ప్రభుత్వం తెలియజేస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. మార్క్‌ఫెడ్‌లో భారీ కుంభకోణం: కాంగ్రెస్‌

మార్క్‌ఫెడ్‌లో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశిస్తే సమగ్ర సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం కోళ్ల రైతులకు కాకుండా కోళ్ల వ్యాపారులకు లాభం కలిగేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 4.16 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను పార్టీతో సంబంధం ఉన్న కొంత మంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘అమరావతి’పై ఆందోళనొద్దు: సుజనా

రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్‌ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ఆయనను కలవాలని రైతులకు సూచించారు. రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతుల బృందం ఆయనను శనివారం కలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.