Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001006
            [news_title_telugu_html] => 

జైట్లీ పార్ధివ దేహానికి చంద్రబాబు నివాళి

[news_title_telugu] => జైట్లీ పార్ధివ దేహానికి చంద్రబాబు నివాళి [news_title_english] => Chandrababu pays condolence to Jaitly [news_short_description] => దేశం అరుణ్‌ జైట్లీ లాంటి గొప్ప సంస్కరణ కర్తను కోల్పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దిల్లీలోని కైలాష్‌నగర్‌లో భాజపా సీనియర్‌నేత జైట్లీ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో.. [news_tags_keywords] => Chandrababu,Jaitly,Delhi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 09:24:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జైట్లీ పార్ధివ దేహానికి చంద్రబాబు నివాళి - Chandrababu pays condolence to Jaitly - EENADU
close

తాజా వార్తలు

జైట్లీ పార్ధివ దేహానికి చంద్రబాబు నివాళి

దిల్లీ: దేశం అరుణ్‌ జైట్లీ లాంటి గొప్ప సంస్కరణ కర్తను కోల్పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దిల్లీలోని కైలాష్‌నగర్‌లో భాజపా సీనియర్‌నేత జైట్లీ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సమయంలో జైట్లీ ఏపీకి సానుకూలంగా స్పందించారని చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు అరుణ్‌ జైట్లీ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నివాళులర్పించిన వారిలో ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

నిగంబోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు
జైట్లీ పార్థీవ దేహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం కైలాష్‌ నగర్‌లోని తన నివాసం నుంచి ఉదయం 11 గంటలకు భాజపా కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. మధ్యాహ్నం 1.30గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమ యాత్రగా బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌లో అంతిమ సంస్కారాలు జరుపనున్నట్లు భాజపా నాయకుడు సుధాన్షు మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.