Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001032
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ @ 1 PM [news_title_english] => ONE PM NEWS [news_short_description] => అసెంబ్లీ ఫర్నీచర్‌ దారి మళ్లింపు వ్యవహారంపై ఏపీ శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో అసెంబ్లీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఈశ్వరరావు చేసిన ఫిర్యాదు మేరకు... [news_tags_keywords] => TOP NEWS,1 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 13:00:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ @ 1 PM - ONE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. మాజీ సభాపతి కోడెలపై కేసు నమోదు

అసెంబ్లీ ఫర్నీచర్‌ దారి మళ్లింపు వ్యవహారంపై ఏపీ శాసనసభ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావుపై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో అసెంబ్లీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఈశ్వరరావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోడెల కుమారుడు శివరామకృష్ణపైనా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి2. 

2. జైట్లీ భార్యకు సోనియా భావోద్వేగ లేఖ

చివరి వరకు ధైర్యం కోల్పోకుండా మృత్యువుతో పోరాడి అరుణ్‌ జైట్లీ పోరాట పటిమను ప్రదర్శించారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. దేశం గొప్ప ప్రజానాయకుణ్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేసిన ఆమె జైట్లీ భార్య సంగీతా జైట్లీకి సంతాప లేఖ రాశారు. పార్టీలకతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేతని దేశం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎట్టకేలకు పడవను తొలగించారు

ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద చిక్కుకున్న పడవను బయటకు తీసేందుకు నిపుణుల బృందం ప్రయత్నాలు ఫలించాయి. గత ఐదు రోజులుగా శ్రమించిన నిపుణుల బృందం ఎట్టకేలకు పడవను గేటు నుంచి తొలగించింది. పడవకు రంద్రాలు చేసి ఇనుపతాడు సాయంతో బయటకు తీశారు. దీనికోసం కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నిపుణుల బృందాలు ఇందులో పాల్గొన్నాయి. కృష్ణానది వరద సమయంలో ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద పడవ చిక్కుకున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జైట్లీ భౌతికకాయానికి నేతల నివాళి

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మత్రి అరుణ్‌ జైట్లీ భౌతికకాయానికి ఆదివారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ మేరకు దిల్లీలోని కైలాష్‌ నగర్‌లోని ఆయన నివాసానికి నేతలు బారులు తీరారు. ఆయన పార్థివవదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, భాజపా ఎంపీ కిరణ్‌ ఖేర్‌, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వరల్డ్ సూపర్‌ బుల్‌తో జగపతిబాబు

ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు జగపతిబాబు. కథానాయకుడు ఎవరైనా సరే, అందులో మంచి పాత్ర ఉంటే దర్శక-నిర్మాతలకు మొదటి ప్రాధాన్యం ఆయనే. ప్రస్తుతం జగపతిబాబు అమెరికాలో ఉన్నారు. అక్కడి ఐయోవా రాష్ట్రంలో జరిగే స్టేట్‌ ఫెయిర్‌లో విశేషాలను చూస్తూ ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ఫెయిర్‌లో ఉంచిన వరల్డ్‌ సూపర్‌ బుల్‌తో ఫొటో దిగారు. దాదాపు 2వేల టన్నుల బరువున్న బుల్‌ పక్కన ఫొటో దిగి అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అశ్విన్‌పై పంజాబ్‌ వేటు?

టీమిండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్‌లో ప్రస్తుతం అతడు కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌కు సారథిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో సారథిగా అశ్విన్‌ ఘోరంగా విఫలం కావడంతో జట్టు యాజమాన్యం ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా అశ్విన్‌ను పక్కన పెట్టి వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘సాహో’లో అదే పెద్ద ట్విస్ట్‌..!

‘బాహుబలి’ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. ఇటీవల విడులైన సాహో ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రభాస్‌ రూ.2 వేల కోట్ల దోపిడికి సంబంధించిన కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ పాత్రలో ఓ పెద్ద ట్విస్ట్‌ ఉండబోతుందంట. అది ఏమిటంటే ప్రభాస్‌ ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆగస్టులో మరో రూ.3వేల కోట్ల విక్రయాలు

విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి ఆగస్టులో రూ.3,014 కోట్లను ఉపసంహరించుకొన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఈ వారం నుంచి మాత్రం మార్కెట్లు కోలుకొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎఫ్‌పీఐలపై సర్‌ఛార్జిని ఉపసంహరించుకోవడం వంటి నిర్ణయాలు మార్కెట్‌కు ఊపునిచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 1 నుంచి 23 వరకు డేటాను పరిశీలిస్తే రూ.12,105 కోట్లను ఎఫ్‌పీఐలు ఉపసంహరించగా.. రూ.9,090 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అల్లు అర్జున్‌ బీస్ట్‌ను చూశారా..!

స్టైలీష్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు కార్లు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిన విషమయే. తాజాగా ఆయన రెంజ్‌రోవర్‌ కారును కొన్నారు. ఆయన ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ కారుకు బీస్ట్‌ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. కారుకు సంబంధించిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ ‘మా ఇంట్లో మరో కొత్త కారు. దానికి నేను బీస్ట్‌ అనే పేరు పెట్టాను. నేను ఏది కొన్నా నా మైండ్‌లో ఒకటే ఉంటుంది. అదే కృతజ్ఞత.’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పులిచింతల జలాశయంలో మొసళ్ల సంచారం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.