Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001093
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM [news_title_english] => FIVE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS, 5 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 17:00:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM - FIVE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ముగిసిన అరుణ్‌జైట్లీ అంత్యక్రియలు

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చితికి కుమారుడు రోహన్‌ నిప్పంటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, పలు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు హాజరై జైట్లీకి తుది వీడ్కోలు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మీ దయాగుణానికి ధన్యవాదాలు: ప్రధాని మోదీ

బహ్రెయిన్‌ ప్రభుత్వం మానవతా దృక్పథంతో అక్కడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 250 మంది భారతీయులను విడుదల చేసినందకు గానూ ఆ దేశ రాజు హమద్‌ బిన్‌ ఇసా ఖలీఫాకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. గల్ఫ్‌ దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ తమ దేశానికి వచ్చిన సందర్భంగా బహ్రెయిన్‌ ప్రభుత్వం అక్కడ జైళ్లలో ఉన్న భారతీయులను మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: బొత్స

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఇంతకు మందు తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. విజయనగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడారు. రాజధానిపై పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ వైఖరిలా ఉన్నాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఇంతకంటే రాజకీయం ఏముండదు: ప్రియాంక

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ సారథ్యంలో శ్రీనగర్‌ చేరుకున్న ప్రతిపక్ష ప్రతినిధి బృందాన్ని అధికారులు అడ్డుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. ‘ఇంతకంటే రాజకీయం, దేశద్రోహం’ ఇంకా ఏముంటుందని నిలదీశారు. కశ్మీరీ ప్రజల హక్కుల్ని హరించివేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఈ-కేవైసీకి ఎలాంటి తుది గడువు లేదు: శశిధర్‌

రేషన్ కార్డు దారులు ఈ-కేవైసీ చేయించుకునేందుకు ఎలాంటి తుది గడువు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ అప్‌డేట్‌ కోసం ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిదానంగా వీలైనప్పుడు వాటిని అప్‌డేట్‌ చేయించుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆధార్‌బయోమెట్రిక్‌ వివరాల నమోదు కోసం ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్ళనవసరం లేదని, అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్దే అధికారులు వాటిని అప్‌డేట్‌ చేస్తారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’లో మెరిసిన తారలు

7. వైరల్‌ అవుతున్న ధోనీ కొత్త లుక్‌

టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ధోనీ ఇటీవల సైనిక విధులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మిస్టర్‌ కూల్‌ కొత్త లుక్‌లో జైపూర్‌ విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. ఓ వేడుకకు హాజరై వస్తూ మీడియా కంట పడ్డాడు. దీంతో పాటు అక్కడ తన స్నేహితులు, అభిమానులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. తలకు నల్లటి బంధన్‌ కట్టుకుని కనిపించాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. సాహో.. ఈపాట కోసం అన్ని కోట్లు తీసుకుందా?

‘సాహో’ సినిమా కోసం టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 30న విడుదల కాబోతున్న ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో ప్రభాస్‌తో కలిసి బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆడిపాడారు. ఇటీవల విడుదల చేసిన ఈ పాట వీడియోకు విశేషమైన స్పందన లభించింది. అయితే ఈ ఒక్క పాట కోసం నటి భారీ మొత్తం పారితోషికంగా తీసుకున్నారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆమె రూ.2 కోట్లు నిర్మాతల నుంచి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కొత్త రంగులో కవాసకీ నింజా

ఇండియా కవాసకీ మోటార్స్‌ భారత్‌లో ‘ది 2020 నింజా జెడ్‌ఎక్స్‌-10ఆర్‌’ను విడుదల చేసింది. దీనికి సరికొత్త రంగులను కూడా జత చేసింది. సాధారణంగా నింజా స్పోర్ట్స్‌ బైక్‌లు ఆకుపచ్చ నలుపు రంగుల్లో ఉంటాయి. కానీ, ఈసారి బైక్‌ హైలైట్స్‌ను బంగారు వన్నెలో తీర్చిదిద్దారు. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.13.99లక్షలుగా నిర్ణయించారు. కేవలం రంగుల్లో మాత్రమే నింజాలో మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. భారత్‌లో 25శాతం పన్ను చాలు..

భారత ప్రభుత్వం ఎటువంటి సర్‌ఛార్జీలు, సెస్సులు లేకుండా కేవలం 25శాతం కార్పొరేట్‌ టాక్స్‌రేటును అమలు చేయవచ్చని గ్లోబల్‌ రేటింగ్‌ సంస్థ కేపీఎంజీ వెల్లడించింది. ‘ఇండియా: రీడిఫైనింగ్‌ ఇట్స్‌ గ్రోత్‌ పాత్‌’ పేరిటి ఇచ్చిన నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. మినిమమ్‌ ఆల్టర్‌నేటివ్‌ టాక్స్‌ను రద్దు చేయాలని, డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)ను విత్‌హోల్డ్‌ ట్యాక్స్‌తో భర్తీ చేయాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.