Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001131
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM [news_title_english] => NINE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS, 9 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 21:00:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM - NINE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. చరిత్ర సృష్టించిన పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో  ఘనవిజయం సాధించింది. తొలి రౌండ్‌లో అదరగొట్టిన పీవీ సింధు రెండో రౌండ్‌లోనూ దూసుకెళ్లింది. రెండో గేమ్‌లోనూ ఆదినుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పైచేయి సాధించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌ అభినందనలు

ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ కైవసం చేసుకున్న తెలుగుతేజం పీవీ సింధుపై ప్రముఖులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు నరసింహన్‌, బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌, మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు అభినందనలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రత్యేక కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

4. ‘4 రాజధానులు.. జగన్‌ యోచన అదే!’

రాజధానిగా అమరావతిని కొనసాగనీయబోమని కేంద్రంతో సీఎం జగన్‌ చెప్పారని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు. కర్నూలులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే యోచనలో జగన్‌ ఉన్నట్లు టీజీ తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం ముందుకు వెళ్తున్నారన్నారు. ఆయన చేసే పనిని ప్రజలు హర్షిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఆ మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌:సింధు తల్లి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్న భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సింధు విజయం సాధించిన అనంతరం వారంతా ఒకరినొకరు అభినందించుకుంటూ మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా విజయ ఈనాడు-ఈటీవీతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సింధు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణిపై గెలవడం టర్నింగ్‌పాయింట్‌ అని ఆమె వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అన్యమత ప్రచారంపై నివేదిక కోరాం:సీఎస్‌

తాళపత్ర గ్రంథాల పరిరక్షణ, పునఃముద్రణపై తితిదే అధికారులతో చర్చించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాల శాస్త్రీయతపై పరిశోధనలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. టికెట్ల వెనుక అన్యమత ప్రచారం వ్యవహారంలో దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆర్టీసీ ఎండీని  ఆదేశించామని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. జమ్ము కశ్మీర్‌ ఆంక్షలు: ఐఏఎస్‌ రాజీనామా

జమ్ము కశ్మీర్‌లో ఇరవై రోజులుగా విధిస్తున్న ఆంక్షలకు నిరసనగా ఓ ఐఏఎస్‌ అధికారి రాజీనామా చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన తర్వాత భద్రత పేరుతో కశ్మీర్‌ ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కేరళకు చెందిన 33 ఏళ్ల కన్నన్‌ గోపీనాథన్‌ ఆగస్టు 21న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. తెలుగు తేజం పీవీ సింధూ ‘బంగారం’

9. సంచలనం రేపుతున్న గృహ హింస వీడియో

గృహ హింసకు సంబంధించి ఓ మహిళ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గృహ హింస వల్ల ఆడవారు భౌతికంగా, మానసికంగా ఎలాంటి వేదనకు గురవుతారో ఈ వీడియో కళ్లకు కట్టింది. జెనాన్‌ ముస్సా అనే మహిళ ఈ వీడియోను ట్విటర్‌లో ఉంచింది. ‘గృహ హింసపై అవగాహన కల్పించేందుకు ఇదో శక్తిమంతమైన వీడియో’ అని క్యాప్షన్‌ రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. డీజిల్‌ మోడళ్లను కొనసాగిస్తాము: టయోటా

భారత్‌లో డీజిల్‌  కార్ల విక్రయాలను కొనసాగించాలని టయోట  నిర్ణయించింది. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కొత్త నిబంధనలు వస్తున్న నేపథ్యంలో ఈ కార్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే టయోటా భారత్‌లో బీఎస్‌-6 డీజిల్‌ ఇంజిన్లను తయారు చేసే ప్లాంటులో పెట్టుబడులను కూడా పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.