Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001531
            [news_title_telugu_html] => 

నగరాల్లో ప్రత్యక్షమవుతున్న రోబో రెస్టారెంట్లు

[news_title_telugu] => నగరాల్లో ప్రత్యక్షమవుతున్న రోబో రెస్టారెంట్లు [news_title_english] => Robot restaurants appearing in cities [news_short_description] => సాంకేతిక పరిజ్ఞానం ఊరేగుతున్న ఈ రోజుల్లో సాధ్యంకానిది ఏదీలేదంటూ నిరూపిస్తుంది నేటి తరం. ఇదే కోవలోకి వచ్చింది ఓ రెస్టారెంట్‌. సాధారణంగా ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా మనకు నచ్చిన వంటకాన్ని తెప్పించుకోవాలంటే బేరర్‌ను పిలుస్తాం. [news_tags_keywords] => Robot restaurants, bengaluru [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => oOexDjoRG2o [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 13:03:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నగరాల్లో ప్రత్యక్షమవుతున్న రోబో రెస్టారెంట్లు - Robot restaurants appearing in cities - EENADU
close

తాజా వార్తలు

నగరాల్లో ప్రత్యక్షమవుతున్న రోబో రెస్టారెంట్లు

బెంగళూరు: అన్ని రంగాల్లో సాంకేతిక వినియోగం పెరుగుతున్న ఈ రోజుల్లో సాధ్యం కానిది ఏదీలేదంటూ నిరూపిస్తోంది నేటి తరం. ఇదే కోవలోకి వచ్చింది ఓ రెస్టారెంట్‌. సాధారణంగా ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా మనకు నచ్చిన వంటకాన్ని తెప్పించుకోవాలంటే బేరర్‌ను పిలుస్తాం. కానీ బెంగళూరులోని ఇందిరా నగర్‌లో ఓ రెస్టారెంట్‌ నిర్వాహకులు మాత్రం వినూత్నంగా ఆలోచించి బేరర్‌కు బదులుగా రోబోలను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్‌లోని మర మనుషులు బేరర్స్ మాదిరిగానే ఆహారాన్ని చక్కగా వడ్డిస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఆరు రోబోలతో కూడిన ఈ రెస్టారెంట్‌లో ప్రతీ టేబుల్‌పై ఓ స్మార్ట్‌ ట్యాబ్‌ ఉంటుంది. అందులో మనకు నచ్చిన వంటకాన్ని ఆర్డర్‌ చేస్తే చాలు.. రోబోలు మన టేబుల్‌ వద్దకే తెచ్చి ఇస్తాయి.

చెన్నై, కోయంబత్తూర్‌లలో ఈ తరహా రెస్టారెంట్‌ విజయవంతం కావడంతో బెంగళూరులోనూ దీన్ని ప్రారంభించారు. ఇప్పటికే భోజన ప్రియులతో  రెస్టారెంట్‌ రద్దీగా మారింది. ఈ రోబోలు కేవలం ఆహారాన్ని వడ్డించడమే కాకుండా పుట్టిన రోజు పాటలను కూడా పాడటం విశేషం. ఇటువంటి సేవలను అందిస్తోన్న ఈ రోబోలు రెస్టారెంట్‌కు వచ్చిన వారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.