close

తాజా వార్తలు

జగన్‌ ఆదేశాలతోనే బొత్స వ్యాఖ్యలు: యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి హైదరాబాద్‌లో ఎకానమీని పెంచడమే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యమని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తెరాస రుణం తీర్చుకోవడానికి ఏపీ అభివృద్ధికి గండికొట్టడం హేయమని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి జగన్ రివర్స్ రూలింగ్‌ పాలనే కారణమని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆదేశాలతోనే రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.

ఏపీ సర్వనాశనం కావాలన్నదే జగన్‌ స్వప్నమని యనమల మండిపడ్డారు. ఏపీకి తెదేపా అధినేత చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తే.. దానిని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్‌ పని చేస్తున్నారని విమర్శించారు. వైకాపా నాయకుల నేర చరిత్ర చూసి రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావని ఎద్దేవా చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన ఇలా అన్ని రంగాలకు సీఎం జగన్‌ తూట్లు పొడిచారని ఆరోపించారు. తాజా ఎన్నికల్లో తెరాస నుంచి వైకాపా మేలు పొందిందని, దానికి ప్రత్యుపకారంగానే ఏపీలో ఆర్థికమాంద్యం సృష్టిస్తోందని యనమల విమర్శించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.