close

తాజా వార్తలు

తితిదే ఘటనపై శ్వేతపత్రం విడుదల చేయాలి

భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి

తిరుపతి: తితిదే ట్రెజరీలో ఉన్న నగలు మాయమవడం దారుణమని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. తితిదే ట్రెజరీలో 5 కేజీల వెండి కిరీటం, రెండు ఉంగరాలు మాయమవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నగలు మాయమైనట్లు 2018 మే 5న తితిదే దృష్టికి వచ్చిందని, అసలు ఏం జరిగిందో ఇన్ని రోజులు భక్తులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దీనికి బాధ్యుడిని చేస్తూ ఏఈవో శ్రీనివాసులుపై రూ.7,76 లక్షల రికవరీపెట్టారని తెలిపారు. అసలు ఒక్క వ్యక్తే.. ట్రెజరీ నుంచి ఈ నగలను ఎలా మాయం చేస్తాడని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరిని కాపాడేందుకు ఇన్ని రోజులు ఈ వ్యవహారాన్ని దాచిపెట్టారని ఆరోపించారు. శ్రీనివాసుల నెల జీతం రూ.28 వేలు అని, అతడి జీతం నుంచి ఎలా మినహాయించుకుంటారని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఇవాళ సాయంత్రంలోపు శ్వేతపత్రం విడుదల చేయాలని, ఈవో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రేపు ఉదయం తితిదే పరిపాలన భవనాన్ని మట్టడిస్తామని హెచ్చరించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.