close

తాజా వార్తలు

‘యురేనియం’తో ఒక్క రైతూ నష్టపోకూడదు

వ్యర్థాల సమస్యపై సీఎం జగన్‌ సమీక్ష

కడప: కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం వ్యర్థాల సమస్యలపై పులివెందులలో సమీక్ష నిర్వహించారు. యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (యూసీఐఎల్‌) సీఎండీ అస్మానీ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. యురేనియం వ్యర్థాల వల్ల తాగునీరు, పంటలు కలుషితమవుతున్నాయనే ఫిర్యాదులపై దృష్టి సారించాలని సీఎం జగన్‌ సూచించారు. ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకూడదని ఆదేశించారు. యురేనియం కర్మాగారం కాలుష్య వ్యర్థాలు- పర్యవసనాలపై పదిరోజుల్లో ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. అనర్థాలపై స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.