close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఇక ప్రభుత్వ రథచక్రం

ఆర్టీసీ ఇక ప్రభుత్వ రథచక్రం కానుంది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్పోరేషన్‌గా సేవలందించిన ఆర్టీసీ ఉద్యోగులంతా ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం.. ప్రభుత్వంలో ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులను అందులోకి బదిలీ చేస్తారు. వారి పదవీ విరమణ వయసు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే 60 ఏళ్లుగా ఉంటుంది. సాంకేతిక కారణాలవల్ల సంస్థ విలీనానికి సమయం పడుతుంది. దీనిపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం చర్చించి తుది ఆమోదం తెలపనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

2. పదవీ విరమణ వయసు 60 లేదా 61

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 లేదా 61 సంవత్సరాలకు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అవసరమైతే సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టిస్తామని వెల్లడించారు. అన్ని శాఖల్లో పదోన్నతులకు జాబితా రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో సీఎం మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

3. తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు సాధారణ ఎన్నికలు

బోగస్‌ ఓట్లను అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు జరిపేందుకు నిర్ణయించామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. కొందరు తెలంగాణలో ఓటు వేసి మళ్లీ ఆంధ్రాలోనూ వేసేందుకు వెళ్తున్న కారణంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చామని, కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకు అంగీకరించిందని రజత్‌కుమార్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి   

4. ఆంధ్రాబ్యాంకు విలీనాన్ని ఆపండి

ఆంధ్రాబ్యాంకు తెలుగు ప్రజలకు ప్రేరణగా నిలిచిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. 2023లో బ్యాంకు శత వసంతాల వేడుక చేసుకునేందుకు తెలుగు ప్రజలంతా సిద్ధమవుతుంటే దాన్ని యూనియన్‌ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులతో విలీనం చేయడం ప్రజల్ని తీవ్రంగా బాధిస్తోందన్నారు. ఆయన ఈ మేరకు ఓ లేఖలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నివేదించారు. బ్యాంకు విలీనాన్ని నిలుపుదల చేయాలని విన్నవించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

5. ప్రాథమిక హక్కుగా ఆరోగ్యం

ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుల కిందికి చేర్చాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా దానిని ప్రకటించాలని, ఆరోగ్య అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చడం ద్వారా కేంద్రం సైతం కొంత బాధ్యత పంచుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని సూచించింది. ఆర్థిక సంఘంలో వైద్య రంగంపై ఏర్పడిన ఉప బృందం దీంతో సహా మరికొన్ని అంశాలపై చేసిన సూచనలు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

6. జేఈఈ మెయిన్‌లో.. కీలక మార్పులు!

జేఈఈ మెయిన్‌లో పలు కీలక మార్పులు జరిగాయి. జేఈఈ విధానం ప్రవేశపెట్టిన ఎనిమిదేళ్ల తర్వాత పరీక్ష ప్రశ్నపత్రంలో జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు (జేఏబీ) పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశానికి, జేఈఈ అడ్వాన్సుడ్‌కు అర్హత సాధించడానికి జేఈఈ మెయిన్‌ నిర్వహణ బాధ్యతను సీబీఎస్‌ఈ నుంచి జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

7. ట్రాక్టర్‌ ఇసుక రూ.1,687

రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విధానం ఆమోదించడమే కాకుండా, ఇసుక ధరను కూడా ఖరారు చేయనున్నారు. ట్రాక్టరు ఇసుక ధర రూ.1,687.50 ఖరారయ్యే  వీలుంది. ఈ మేరకు ఏపీఎండీసీ అధికారులు పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపవచ్చని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

8. ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం అధ్యక్షుడిగా సునీల్‌ అరోడా

ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం (ఏడబ్ల్యుఈబీ) అధ్యక్షుడిగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) సునీల్‌ అరోడా నియమితులయ్యారు. బెంగళూరులో నిర్వహిస్తున్న ఏడబ్ల్యుఈబీ నాలుగో సర్వసభ్య సమావేశంలో సమాఖ్య మాజీ అధ్యక్షుడు అయాన్‌ మింకు రాడులెస్కు (రొమేనియా) నుంచి సునీల్‌ అరోడా ఈ బాధ్యతలు స్వీకరించారు. 2021 వరకు ఆయనీ పదవిలో కొనసాగుతారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

9. జమ్మూ-కశ్మీర్‌ సర్పంచులకు పోలీసు భద్రత

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న గ్రామ సర్పంచులు, పంచాయతీ సభ్యులకు పోలీసు భద్రత; ఒక్కొక్కరికి రూ.2 లక్షల మొత్తానికి బీమా కల్పించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. జమ్మూ, కశ్మీర్‌ లోయ ప్రాంతాలకు చెందిన గ్రామ పంచాయతీ ప్రతినిధుల బృందం మంగళవారమిక్కడ అమిత్‌ షా, ప్రధాని కార్యాలయ మంత్రి జితేంద్రసింగ్‌లతో భేటీ అయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

10. స్మిత్‌ సాధించాడు

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకుల జాబితాలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని వెనక్కి నెట్టి స్మిత్‌ నంబర్‌వన్‌ అయ్యాడు. ఇంగ్లాండ్‌తో యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో రెండు సెంచరీలు చేసిన స్మిత్‌.. ఆస్ట్రేలియాను గెలిపించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.