close

తాజా వార్తలు

గవర్నర్‌ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాలకు దాదాపు తొమ్మిదిన్నరేళ్ల పాటు గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. బెంగళూరు వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌ దంపతులకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన తన సతీమణితో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయల్దేరారు.  ప్రభుత్వం తరఫున నరసింహన్‌ వెంట ఆర్‌అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి, ఏడీసీని పంపారు.  ఆదివారం ఉదయం కొత్త గవర్నర్‌గా తమిళిసై ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో నరసింహన్‌ ఈ రోజు తన బాధ్యతల నుంచి వైదొలిగారు. బేగంపేట విమానాశ్రయం నుంచివెళ్తున్న సమయంలో గవర్నర్‌ భావోద్వేగానికి గురయ్యారు.

అంతకముందు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ దంపతులు గవర్నర్‌ దంపతులను ఘనంగా సన్మానించారు. శాసనసభాపతి, ఉపసభాపతి, మండలి ఉపాధ్యక్షుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నరసింహన్‌ దంపతులు రాజ్‌భవన్‌కు చేరుకొని సాయంత్రం బెంగళూరుకు పయనమయ్యారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.