close

తాజా వార్తలు

ప్రాజెక్టుల న్యాయసమీక్షకు జడ్జి నియామకం

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వనరుల శాఖలో ప్రాజెక్టుల న్యాయ సమీక్ష కోసం ఏపీ ప్రభుత్వం హైకోర్టు జడ్జిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టు జడ్జి జస్టిస్‌ శివశంకర్‌రావును నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన నియామకానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, టెండర్లను ఈ న్యాయమూర్తి సమీక్షించనున్నారు. రూ.వంద కోట్లు దాటిన అన్ని ప్రాజెక్టులు, టెండర్లను అన్నింటినీ న్యాయమూర్తి పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో అభ్యంతరాలన్నింటినీ సమీక్షించిన అనంతరం బహిరంగపర్చనున్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన నిపుణులను, న్యాయసమీక్షకు కావాల్సిన ఇతర సౌకర్యాలను ప్రభుత్వం అందించనుంది. ఏపీ మౌలిక సదుపాయాల కల్పన పారదర్శకత కోసం గతంలో శాసనసభలో చట్టాన్ని కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.