Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009693
            [news_title_telugu_html] => 

నిమజ్జనానికి కదిలిన ఖైరతాబాద్‌ మహా గణపతి

[news_title_telugu] => నిమజ్జనానికి కదిలిన ఖైరతాబాద్‌ మహా గణపతి [news_title_english] => Khairatabad Ganesh sobha Yatra Started [news_short_description] => ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానికి కదిలాడు. నిర్వాహకులు భారీ క్రేన్‌ సహాయంతో విగ్రహాన్ని పెద్ద వాహనంపైకి ఎక్కించారు. నిమజ్జనం కార్యక్రమాన్ని ఇవాళ మధ్యాహ్నంలోగా పూర్తి చేసేందుకు [news_tags_keywords] => Hyderabad,Khairatabad, Vinayaka Chaviti [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 07:35:27 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నిమజ్జనానికి కదిలిన ఖైరతాబాద్‌ మహా గణపతి - Khairatabad Ganesh sobha Yatra Started - EENADU
close

తాజా వార్తలు

నిమజ్జనానికి కదిలిన ఖైరతాబాద్‌ మహా గణపతి

హైదరాబాద్‌: ప్రసిద్ధ ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానికి కదిలాడు. క్రేన్‌ సహాయంతో నిర్వాహకులు, పోలీసు సిబ్బంది విగ్రహాన్ని భారీ వాహనంపైకి ఎక్కించారు. గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఇవాళ మధ్యాహ్నంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని విగ్రహాలను ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తున్నారు. మహాగణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు భారీ క్రేన్‌ను ఇప్పటికే హుస్సేన్‌సాగర్‌ దగ్గర సిద్ధం చేశారు. మరోవైపు హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. అయినప్పటికీ వర్షం మధ్యే ఎన్టీఆర్‌ మార్గ్‌లో భక్తులు విగ్రహాల నిమజ్జనం కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో సుమారు 40వేల వరకు గణనాథుడి ప్రతిమలను గురువారం నిమజ్జనం చేయనున్నారు. ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగనున్న దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచే అమలవుతున్న దృష్ట్యా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.  జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. 35 వేల మంది పోలీసులతో నగరంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వ్యక్తిగత వాహనాలు తీసుకొస్తే ఇబ్బందులు పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు దాదాపు 10 వేల మంది కార్మికులు పారిశుద్ధ్య పనుల్లో నిమగ్నమయ్యారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.