Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009798
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM [news_title_english] => FIVE PM NEWS [news_short_description] => ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 10 రోజుల పాటు పూజలందుకున్న ద్వాదశ ముఖ లంబోదరుడిని ఉత్సవ సమితి సభ్యులు ఈ మధ్యాహ్నం నిమజ్జనం చేశారు. ఈ ఉదయం ప్రారంభమైన గణనాథుడి శోభయాత్రతో నగరవీధులు కిక్కిరిసిపోయాయి. [news_tags_keywords] => TOP NEWS, 5 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 17:00:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM - FIVE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. మహాగణపతికి మనసారా వీడ్కోలు..!

ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 10 రోజుల పాటు పూజలందుకున్న ద్వాదశ ముఖ లంబోదరుడిని ఉత్సవ సమితి సభ్యులు ఈ మధ్యాహ్నం నిమజ్జనం చేశారు. ఈ ఉదయం ప్రారంభమైన గణనాథుడి శోభయాత్రతో నగరవీధులు కిక్కిరిసిపోయాయి. సుమారు  ఏడు గంటల పాటు ఈ యాత్ర సాగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ప్రాజెక్టుల్లో కుంభకోణాలు లేకుండాచూడండి:జగన్‌

సాగునీటి ప్రాజెక్టుల్లో కుంభకోణాలు లేకుండా చూడాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జలవననరుల శాఖ ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ ఏడాది కృష్ణా వరద జలాలు బాగా వచ్చాయని.. అయినా రాయలసీమ ప్రాజెక్టులు నింపడానికి సమయం పడుతోందని సీఎం అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ప్చ్‌.. టాప్‌ 300 విద్యాసంస్థల్లో మనం లేం

2020 సంవత్సరానికి గానూ టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థల ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలోని తొలి 300ల్లో భారత్‌ నుంచి ఒక్క ఇనిస్టిట్యూట్‌ కూడా లేదు. గతేడాది టాప్‌-300లో చోటు దక్కించుకున్న ఏకైక భారత విద్యాసంస్థ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) బెంగళూరు కూడా ఈ సారి 301-350 ర్యాంక్‌ గ్రూప్‌కు పడిపోయింది. మరో విద్యాసంస్థ ఐఐటీ-రోపర్‌ కూడా 301-350 గ్రూప్‌లో చోటుదక్కించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. టూవీలర్‌ ట్యాక్సీ డ్రైవర్లకు వర్తించదు:పేర్ని

వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేల ఆర్థికసాయం అందజేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈనెల 14వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. దరఖాస్తుల దాఖలుకు తుది గడువు ఈనెల 25గా నిర్ణయించామని మంత్రి వివరించారు. టూ వీలర్‌ ట్యాక్సీ డ్రైవర్లకు ఈ పథకం వర్తించదని.. అలాంటి వారికి వచ్చే ఏడాది నుంచి అందించే ఆలోచన చేస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌బిలియన్‌ డేస్‌’.. ఎప్పట్నుంచంటే?

ఎప్పటిలానే ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’తో ముందుకొచ్చింది. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు ఆరు రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహిస్తోంది. అన్ని కేటగిరీల్లోని ఉత్పత్తులపై డిస్కౌంట్‌ అందిస్తోంది. అయితే, మొబైల్స్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర యాక్సెసరీస్‌పై డిస్కౌంట్లను సేల్‌ ప్రారంభమైన ఒక రోజు తర్వాత అంటే.. సెప్టెంబర్‌ 30న ప్రకటించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అజమాయిషీ కాదు.. సమన్వయం ముఖ్యం

ఒకరిపై మరొకరి అజమాయిషీ కాకుండా సమన్వయం ఉండాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు సూచించారు. ద్రవ, ఘన వ్యర్థాల నిర్వహణపై మున్సిపల్‌ కమిషనర్లకు విజయవాడలో రాష్ట్రస్థాయి కార్యశాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బొత్స హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడం కంటే.. క్షేత్రస్థాయిలో పరిశీలించడం మంచిదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ముగ్గురు ఉగ్రవాదులు అరెస్టు: ఆయుధాలు సీజ్‌!

దేశంలో ఉగ్ర దాడులు జరిపేందుకు పాక్‌ కుట్రలు చేస్తోందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌ - పంజాబ్‌ సరిహద్దులో కథువా జిల్లాలోని లఖన్‌పూర్‌ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు ముగ్గురు ముష్కరులను అదుపులోకి తీసుకొని.. వారి నుంచి ఆరు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. గృహహింస కేసులో యువరాజ్‌కు భారీ ఊరట

టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌కు గృహహింస కేసులో ఊరట లభించింది. అతడిపై చేసిన ఆరోపణలు, ఫిర్యాదులన్నీ అవాస్తవాలని కేసు పెట్టిన ఆకాంక్ష శర్మ అంగీకరించిందని యువీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. దేశంలో కోట్లాది మంది ప్రేమించే యువీ పేరును దురుద్దేశ పూర్వకంగానే కేసులోకి లాగారని పేర్కొన్నారు. ఇప్పుడు అతడు ప్రశాంతంగా ఉండగలడని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఈడీ విచారణకు డీకే శివకుమార్‌ కుమార్తె

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్య నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్‌ వ్యవహారంలో శివకుమార్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఇటీవల ఐశ్వర్యకు కూడా నోటీసులు అందాయి.  దీంతో ఆమె గురువారం దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. డీకే శివకుమార్‌ నిర్వహిస్తున్న ఓ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు 22ఏళ్ల ఐశ్వర్య ట్రస్టీగా ఉన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మార్కెట్ల లాభాల జోరుకు బ్రేక్‌

ఐదు రోజులుగా లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ మార్కెట్ల పరుగుకు అడ్డుకట్ట పడింది. నిఫ్టీ మళ్లీ 11వేల మార్క్‌ను కోల్పోయింది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 166 పాయింట్లు కోల్పోయి 37,104 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో 10,981 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.34గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.