Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009809
            [news_title_telugu_html] => 

ఐన్‌స్టీన్‌ గ్రావిటీ కనిపెడితే.. మరి న్యూటన్!

[news_title_telugu] => ఐన్‌స్టీన్‌ గ్రావిటీ కనిపెడితే.. మరి న్యూటన్! [news_title_english] => Piyush Goyal says Einstein discovered gravity viral [news_short_description] => ఆర్థిక వ్యవస్థను ఉదహరిస్తూ కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ చేసిన ఒక వ్యాఖ్య ఆయనను ఇరుకున పెట్టేలా చేసింది. గురువారం దిల్లీలో నిర్వహించిన వాణిజ్య సదస్సుకు హాజరైన గోయెల్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. [news_tags_keywords] => piyush goyel ,einstean,newton,gravity,viral,trade meating [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 17:36:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఐన్‌స్టీన్‌ గ్రావిటీ కనిపెడితే.. మరి న్యూటన్! - Piyush Goyal says Einstein discovered gravity viral - EENADU
close

తాజా వార్తలు

ఐన్‌స్టీన్‌ గ్రావిటీ కనిపెడితే.. మరి న్యూటన్!

దిల్లీ: ఆర్థిక వ్యవస్థను ఉదహరిస్తూ కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ చేసిన ఒక వ్యాఖ్య ఆయనను ఇరుకున పెట్టేలా చేసింది. గురువారం దిల్లీలో నిర్వహించిన వాణిజ్య సదస్సుకు హాజరైన గోయెల్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. టీవీల్లో వస్తున్న లెక్కలను చూసి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. మనం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలంటే మన వృద్ధి రేటు 12 శాతం ఉండాలి. కానీ ప్రస్తుతం మన వృద్ధి రేటు 6 శాతమే ఉంది. అలా అని ముందుకెళ్లడం మానేస్తే ఎలా అని అన్నారు. ‘‘ఐన్‌స్టీన్‌ కూడా ఇలాంటి లెక్కలను నమ్ముకుంటే గురుత్వాకర్షణ సిద్ధాంతం కనిపెట్టే వారా?’’ అన్నట్లు ఉదహరించారు. అక్కడే ఆయన పప్పులో కాలేశారు. సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ కనిపెట్టిన గ్రావిటీ సిద్దాంతాన్ని గోయెల్‌ ఐన్‌స్టీన్‌కు కట్టబెట్టడంతో దీనిపై నెటిజన్ల తాకిడి ఎక్కువైంది. ఐన్‌స్టీన్‌ గ్రావిటీ సిద్దాంతాన్ని కనిపెడితే.. మరి న్యూటన్‌ ఏం చేశాడని నెటిజన్లు వ్యంగ్యంగా విమర్శలతో వెల్లువెత్తున్నారు. పొరపాటున గోయెల్‌ చేసిన ఆ వ్యాఖ్య ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.