Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009831
            [news_title_telugu_html] => టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM
            [news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM
            [news_title_english] => NINE PM NEWS
            [news_short_description] => భాజపా తీరును ఎండగట్టేలా సామాజిక మాధ్యమాల్లో మరింత చురుగ్గా వ్యవహరించాలని కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.

            [news_tags_keywords] => TOP NEWS, 9 PM
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-09-12 21:01:03
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM - NINE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ప్రజాస్వామ్యమెప్పుడూ ఇంత ప్రమాదంలోలేదు

భాజపా తీరును ఎండగట్టేలా సామాజిక మాధ్యమాల్లో మరింత చురుగ్గా వ్యవహరించాలని కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, గతంలో ఎప్పుడూ ఈ స్థితిలో లేదని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సమావేశంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బాలాపూర్‌ లడ్డూను అధిగమించిన మరో లడ్డూ

బాలాపూర్‌ గణపతి లడ్డూ ధరను ఫిలింనగర్‌ బస్తీ వినాయకుడి లడ్డూ అధిగమించింది. గురువారం జరిగిన వేలంపాటలో ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్‌ బస్తీ గణపతి లడ్డూ రికార్డు ధర పలికింది. ఏకంగా రూ.17.75 లక్షలు చెల్లించి ఈ లడ్డూను భాజపా నాయకుడు గోవర్థన్‌ దక్కించుకున్నారు. గతేడాది ఈ గణేశ్‌ లడ్డూ రూ.15.1 లక్షలు పలికి నగరంలో రెండో స్థానంలో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిరసనలపై సీఎం కనీసం స్పందించరా?

ముఖ్యమంత్రి జగన్‌పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరచరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి నేరాలే లేకుండా చేస్తానని చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో గురువారం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతితో పాటు దేనిపైనా కనీసం స్పందించకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి తన నిర్లక్ష్యాన్ని, మూర్ఖత్వాన్ని ప్రజలకు వెల్లడిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రవేశరుసుము 20 డాలర్లు

కర్తార్‌పూర్‌ కారిడార్‌ ద్వారా గురుద్వారా సాహిబ్‌ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వచ్చే యాత్రికులకు 20 డాలర్ల రుసుము (రూ.1,400) వసూలు చేయనున్నట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. ఒక్కో యాత్రికుడు 20 డాలర్లు సేవా రుసుం చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇది ప్రవేశ రుసుము కాదని పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేఎల్‌ రాహుల్‌పై వేటు: టీమిండియా టెస్టు జట్టు ఇదే

అనుకున్నట్టే జరిగింది! ఎన్ని అవకాశాలు ఇచ్చిన వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌పై సెలక్టర్లు వేటు వేశారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. బదులుగా యువ ఆటగాడు, దక్షిణాఫ్రికా-ఏపై అన్ని ఫార్మాట్లలోనూ రాణించిన శుభ్‌మన్‌గిల్‌కు చోటిచ్చారు. సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా హిట్‌మ్యాన్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. మూడు టెస్టులకు జట్టును ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సైన్యం రెడీగా ఉంది.. మీ ఆదేశాలే తరువాయి!

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను స్వాధీనం చేసుకొనే అంశంపై కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ స్పందించారు. పీవోకేను సాధించుకోవడమే తదుపరి అజెండా అంటూ ఇటీవల జితేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై రావత్‌ మాట్లాడుతూ.. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం ఆదేశాల మేరకే దేశంలోని సంస్థలు పనిచేస్తాయన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సైన్యం ఎల్లవేళలా సిద్ధంగానే ఉందని ఆయన స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా దీదీ భారీ ర్యాలీ

అసోంలో జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ)ని చేపట్టడాన్ని నిరసిస్తూ తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ర్యాలీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి 5 కిలోమీటర్ల పాటు సాగే ర్యాలీని ఉత్తర కోల్‌కతాలోని సింథీ ప్రాంతం నుంచి ప్రారంభించారు. పాదయాత్రగా చేపట్టిన ఈ ర్యాలీకి భారీగా ప్రజలు తరలివచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వైకాపా 100రోజుల పాలనపై జనసేన నివేదిక

వైకాపా ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన పార్టీ ఓ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వ పరిపాలనా విధానంపై రూపొందించిన నివేదికలోని మూల అంశాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 14న ప్రజల ముందుంచనున్నారు. కొత్త ప్రభుత్వం పరిపాలనా తీరు తెన్నులపై 100 రోజుల పాటు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదని గతంలో పవన్‌ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఆ గడువు ముగిసిపోవడంతో ఇప్పుడు ప్రజల ముందుకు రానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మచిలీపట్నం పోర్టుపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌

మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. పనుల రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 66ను సవాల్‌ చేస్తూ నవయుగ సంస్థ ఇటీవల ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ అంశంపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం, నయుయుగ సంస్థ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పులిహోర తిని 85 మందికి అస్వస్థత

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలో వినాయక నిమజ్జనోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లింగంపల్లి గ్రామంలో గురువారం పులిహోర తిని 85 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా మారడంతో గంగాధరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.