close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. విక్రమ్‌ కోసం రంగంలోకి నాసా

జాబిల్లి ఉపరితలంపై ఉలుకూపలుకూ లేకుండా ఉన్న ‘విక్రమ్‌’ ల్యాండర్‌తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చిట్టచివరి ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ను రంగంలోకి దించింది. మన ల్యాండర్‌తో సంధానమయ్యేందుకు ఆ సంస్థ సంకేతాలను పంపుతోంది. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేపీఎల్‌) తన డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (డీఎస్‌ఎన్‌)లోని భూ కేంద్రాల ద్వారా విక్రమ్‌కు రేడియో తరంగాలను పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌.. మహాత్ముడు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కలను మూడేళ్లలో సాకారం చేసిన మహానుభావుడు, పేదింట ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న మహాత్ముడు కేసీఆర్‌ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం మరియపురం, కరీంనగర్‌ జిల్లా ముగ్దుంపూర్‌లో గురువారం నిర్వహించిన నెలరోజుల ప్రణాళిక కార్యక్రమ సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షల్ని సీఎం నెరవేరుస్తున్నారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి..11 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఖట్లాపురా ఘాట్‌ వద్ద ఇవాళ ఉదయం పడవ బోల్తాపడి 11 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 11 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఆ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ తెలిపారు. గణేశ్‌ నిమజ్జనోత్సవంలో ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నిమజ్జనానికి తరలిన బండి వినాయకులు

హైదరాబాద్‌లోని జీయాజీగూడలో వినాయక నిమజ్జన కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది. 108 వినాయక ప్రతిమలు చిన్న చిన్న నాలుగు చక్రాల బళ్లపై వరుసగా వెళ్తూ అందర్నీ ఆకట్టుకున్నాయి.దీనిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఇది ట్రైలరే.. మున్ముందు పూర్తి సినిమా

ఎన్‌డీఏ-2 ప్రభుత్వ మొదటి వంద రోజుల్లో  అవినీతికి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ట్రైలర్‌ చూపించామని, దేశం చూడాల్సిన పూర్తి సినిమా ఇంకా ముందుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు తొలి సమావేశాల్లోనే ముస్లిం సోదరీమణుల రక్షణ కోసం ముమ్మూరు తలాక్‌ను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. ‘‘మా ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి వేగవంతమైన నిర్ణయాలు ‘ట్రైలర్‌’ మాత్రమే. మున్ముందు ‘పూర్తిస్థాయి సినిమా’ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మోదీ సర్కారుపై వీధి పోరాటాలు

ప్రజలు ఇచ్చిన తీర్పును భాజపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, అధికారాన్ని ‘అత్యంత ప్రమాదకర రీతి’లో ఉపయోగిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. దీనిపై పోరుబాట పట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దీనిని ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. మనం ధైర్యంగా నిలబడాలి. వీధి పోరాటాలు చేయాలి. సామాజిక మాధ్యమాల ద్వారా పోరాడడం అవసరమే. కానీ అదొక్కటే సరిపోదు. ప్రజలను నేరుగా కలవాలి’’ అని దిశానిర్దేశం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. త్వరలో డ్రైవర్‌ రహిత స్వదేశీ కార్లు

భారతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ), విప్రో ఐటీ విభాగాలు సంయుక్తంగా చేపడుతున్న ఐటీ సీజార్‌ ప్రాజెక్టు ఫలితంగా త్వరలో స్వదేశీ పరిజ్ఞానంతో డ్రైవర్‌ రహిత కార్లు రాబోతున్నాయని విప్రో వ్యవస్థాపక అధ్యక్షుడు అజిం ప్రేమ్‌జీ ప్రకటించారు. ఐఐఎస్‌సీతో గతంలో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా అత్యున్నత సాంకేతిక వ్యవస్థలను విప్రోలో పొందుపరిచామన్నారు. ఇందులో భాగంగానే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ‘మెటల్‌ 3-డీ ప్రింటింగ్‌ మిషన్‌’ ద్వారా డ్రైవర్‌ లేని కార్లు తయారవుతున్నాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఫ్రాన్స్‌తో రూ.7000 కోట్ల పన్ను సెటిల్‌మెంట్‌: గూగుల్‌

ఫ్రాన్స్‌తో నడుస్తున్న 945 మిలియన్‌ యూరోల (దాదాపు రూ.7000 కోట్లు) పన్ను వివాదాన్ని పరిష్కరించుకోవడానికి అమెరికా ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ అంగీకరించింది. పన్ను ఎగవేసినందుకు కంపెనీ 500 మిలియన్‌ డాలర్ల జరిమానా చెల్లించనుంది. ఫ్రాన్స్‌ పన్ను సంస్థలతో క్లెయిమ్‌లను పరిష్కరించడానికి మరో 465 మిలియన్‌ డాలర్లు కట్టనుంది. గత కొన్నేళ్లుగా ఫ్రాన్స్‌తో నడుస్తున్న విబేధాలకు స్వస్తి చెప్పడంపై గూగుల్‌ హర్షం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టెస్టు జట్టులోకి రావాలంటే ఇంకా కష్టపడాలి

భారత టెస్టు జట్టులో చోటు సంపాదించాలంటే ఇంకా కఠోర శ్రమ చేయాలని యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైని అన్నాడు. ఇటీవల ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్‌పై టీ20 అరంగేట్రం చేసిన సైని.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అందుకున్నాడు. ‘‘టెస్టుల్లో భారత బౌలింగ్‌ దళం చాలా బలంగా ఉంది. వెస్టిండీస్‌తో టీ20ల్లో టీమ్‌ ఇండియా తరఫున ఆడినప్పుడే ఈ విషయం అర్ధమైంది. మరింత శ్రమ చేస్తేనే భారత టెస్టు జట్టు తలుపు తట్టగలనని తెలుసుకున్నా. షమి, బుమ్రా, భువనేశ్వర్‌ లాంటి పేసర్ల సాహచర్యం ఎంతో మేలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సాయిధరమ్‌తో నిధి?

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్‌. ఇప్పుడు ఆమెకు వరుసగా అవకాశాలు అందుతున్నాయి. సాయిధరమ్‌ తేజ్‌ కొత్త చిత్రంలో నిధి ఓ కథానాయికగా ఎంపికైందని సమాచారం. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాత. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ‘ప్రతిరోజూ పండగే’ తరవాత సాయిధరమ్‌తేజ్‌ నటించే చిత్రమిదే. ఇందులో మరో కథానాయికకీ చోటుందని  తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.