close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. యురేనియం కోసం అనుమతులివ్వం: కేటీఆర్‌

నల్లమలలో యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్రప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, భవిష్యత్‌లోనూ ఇవ్వబోదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.  బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలోని లంబాపూర్‌లో అన్వేషణ జరిగిందని, కానీ, నాగర్‌కర్నూల్‌- అమ్రాబాద్‌ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఏపీ లోకాయుక్తగా లక్ష్మణరెడ్డి ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ప్రమాణం చేయించారు. తుమ్మలపల్లి కాళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. అభివృద్ధి చెందిన దేశాలను అనుసరిస్తున్నాం

ఆర్థిక మాంద్యం పరిస్థితులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థికవృద్ధిలో తెలంగాణ రాష్ట్రం పాత్ర ముఖ్యమైనదని అన్నారు. రాష్ట్రం నుంచి రూ2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాలను అనుసరిస్తోందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

అనుమానంతో తన భార్యను ఓ భర్త అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని వేగాయమ్మపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. మంగాయమ్మ(50), భర్త చంద్రరావులు తరచూ ప్రతి చిన్న విషయానికి గొడవపడేవారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వారి మధ్య మళ్లీ గొడవ చోటుచేసుకుంది. కసి పెంచుకున్న చంద్రరావు అర్ధరాత్రి దాటిన తర్వాత భార్య నిద్రిస్తుండగా గొడ్డలితో తలను నిలువుగా నరికి పరారయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. గడ్చిరోలిలో కాల్పులు.. ఇద్దరు నక్సల్స్‌ హతం

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి గ్రామంలో భద్రతాదళాలు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్‌ హతమయ్యారు. మరో ఆరుగురుకి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలంలో పోలీసులు ఆటోమేటిక్‌ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సత్యనాదెళ్ల తండ్రికి కన్నీటి వీడ్కోలు

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి యుగంధర్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని రాయదుర్గం మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సత్య నాదెళ్ల ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అసమ్మతి నేతల భవిష్యత్తు ఎటు?

కర్ణాటక రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చిన 17 మంది ఎమ్మెల్యేలంతా మళ్లీ తెరపైకి వస్తున్నారు. రెండు నెలల క్రితం రాజీనామాలు చేసి ముంబయిలో కూర్చున్న వీరంతా భవిష్యత్ కోసం పావులు కదపడం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి యడియూరప్ప తమను పట్టించుకోవడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లక్‌ చేయండి 

8. భారత్‌తో మేం గెలవకపోవచ్చు: ఇమ్రాన్‌

భారత్‌ ముందు తమ సామర్థ్యం ఏమాత్రం నిలవదని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పరోక్షంగా అంగీకరించారు. ఇరు దేశాల మధ్య సాంప్రదాయ యుద్ధమే గనక వస్తే పాకిస్థాన్‌ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఒప్పుకొన్నారు. ఇటీవల అల్‌ జజీరా మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భయపెడుతున్న ‘రాజుగారి గది3’ ట్రైలర్‌

10. చాహల్‌, కుల్‌దీప్‌ను ఎందుకు తీసుకోలేదంటే?

టీమిండియా నేటి నుంచి దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇరు జట్ల మధ్యా మూడు టీ20లు, మూడు టెస్టుల సిరీస్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌లో ఇద్దరు స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లకు చోటు దక్కకపోవడంపై కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ స్పందించాడు. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ లైనప్‌ను బలపరిచేందుకే వారికి అవకాశం కల్పించలేదని చెప్పాడు. అలాగే కొన్నేళ్లుగా జాతీయస్థాయిలో, ఐపీఎల్‌ల్లో చక్కటి పదర్శన కనబర్చిన యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నామని కోహ్లీ తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.