close

తాజా వార్తలు

ప్రాణాలు కాపాడిన లైఫ్‌ జాకెట్లు

కొందరికే ఇచ్చిన లాంచీ సిబ్బంది :ప్రయాణికులు

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగి 46 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. పాపికొండలను చూసేందుకు పర్యాటకులు లాంచీలో వెళ్తుండగా ఈ పెను విషాదం జరిగింది. గతంలో ఇలాంటి విషాద ఘటనలు జరిగిన దాఖలాలున్నా నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటు బోటు సిబ్బంది వ్యవహరించడం గమనార్హం. గోదావరిలో ఇప్పటివరకూ 8 మంది మృత దేహాలను వెలికి తీశారు. అయితే లాంచీ మునక ప్రమాదం నుంచి మొత్తం 63 మంది ప్రయాణికుల్లో 24 మంది సురక్షితంగా బయటపడగలిగారు. ప్రయాణికుల్లో కొందరికే బోటు సిబ్బంది లైఫ్‌ జాకెట్లు ఇవ్వడంతో ఎక్కువ మంది గల్లంతయ్యేందుకు అవకాశం ఏర్పడింది. లైఫ్‌ జాకెట్లు ధరించివారు దాదాపు ఒడ్డుకు రాగలిగారు. 

ఇతని పేరు దర్శన సురేశ్‌. వరంగల్‌ జిల్లా కడియపు కొండ గ్రామం. 14 మంది స్నేహితులతో శనివారం రాజమహేంద్రవరం వచ్చారు. ఆదివారం పాపికొండల విహార యాత్రకు సింగంపల్లి నుంచి బయలుదేరారు. లైఫ్‌ జాకెట్లు ధరించి ఉండడం వల్లే బతికామని తెలిపారు. తమతోపాటు వచ్చిన పర్యటకులు కనిపించకుండా పోయారని అన్నారు.



ఈయన పేరు దశరథం. వరంగల్‌ జిల్లా కడిపికొండ గ్రామం. ఉదయం రాజమహేంద్రవరం చేరుకున్న ఈయన సింగంపల్లి వద్ద పాపికొండలు చూసేందుకు లాంచీ ఎక్కారు. మార్గమధ్యలో లాంచీ మునిగిపోయింది. లైఫ్‌ జాకెట్లు ఉండడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరినట్లు చెప్పారు. 


అనకాపల్లి దగ్గర గోపాలపురానికి చెందిన లక్ష్మి భద్రాచలం వెళ్లేందుకు పోచమ్మ గండి వద్ద బోటు ఎక్కారు. దేవీపట్నం మండలం కచులూరు వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో లాంచీ తిరగబడింది. బోటు సిబ్బంది కొంత మందికి మాత్రమే లైఫ్‌ జాకెట్లు ఇచ్చారని లక్ష్మి తెలిపారు. 


 

వరంగల్‌ జిల్లా కాజీపేట మండలానికి చెందిన ప్రభాకర్‌ ఉదయం 11.30కు 14 మంది బృందంతో పశ్చిమగోదావరి జిల్లా రంగంపేట నుంచి ఇదే బోటులో బయలుదేరారు. లాంచీ మునిగడంతో ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.