close

తాజా వార్తలు

గోదావరి ఘటన: ఈయన ఆయన అనుకుని..

గంగవరం: బోటు ప్రమాదంలో తిరుపతికి చెందిన మధులత భర్త సుబ్రహ్మణ్యం ఆచూకీ లభించకపోవడంతో ఆమె బంధువులు శోకసంద్రంలో మునిగారు. కొద్ది సేపటి తర్వాత సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ఆ సమాచారం విన్న మధులత బంధువులు ఆనందించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. ఆయన మధులత భర్త కాదని తెలుసుకుని మళ్లీ దుఃఖ సంద్రంలో మునిగారు.

హెచ్చరికలను పట్టించుకోలేదు
ఈ సీజన్‌లో మొదటి దఫా గత నెల 8న గోదావరిలో జలరవాణా నిలిపేయాలని హెచ్చరికలు జారీ చేశాం. అప్పటినుంచి సుమారు 5లక్షల క్యూసెక్కుల వరద ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్దకు వస్తూనే ఉంది. జలరవాణాకు అనుకూలం కాదనే ఆదేశాలను బోటు యజమాని పట్టించుకోలేదు.

-ఆర్‌.మోహనరావు, ఈఈ,గోదావరి హెడ్‌వర్క్స్‌, ధవళేశ్వరం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.